2021 మొత్తానికి కరోనా ప్రభావం ఉంటుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డా.రామన్ గంగాఖేడ్కర్ హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన క్రమంలో వైరస్ ముప్పు త్వరలోనే తొలగిపోతుందనే భావనలు వస్తున్న క్రమంలో పలు సూచనలు చేశారు. ఓ వార్త సంస్థతో చర్చ సందర్భంగా.. మహమ్మారి వ్యాప్తి స్థితి 'జటిలంగా' ఉందని తెలిపారు.
"త్వరలోనే కొవిడ్ దశ ముగుస్తుందని ఎవరైనా భ్రమలో ఉంటే.. వారు పొరబడినట్లే. అది 2020లో ఉంది.. 2021 మొత్తం ప్రభావం చూపుతుంది. కరోనా ఒక సంక్లిష్టమైన వ్యవహారం. ప్రతి కేసు పట్ల అప్రమత్తంగా ఉండాలి. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది."
- డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటింటాల్సిన అవసరం ఉందని సూచించారు రామన్. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)లో ఎపిడెమియాలజీ, అంటువ్యాధుల విభాగాధిపతిగా పనిచేశారు.
ఇదీ చూడండి: దేశంలో 1.08 కోట్ల టీకా డోసుల పంపిణీ