ETV Bharat / bharat

'భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు 5.2%' - కరోనా క్రియాశీల కేసుల సంఖ్య

భారత్​లో కొవిడ్​-19 పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.20 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 21.15 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా టెస్టింగ్​ సామర్థ్యం పెంచటం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.

COVID-19: National positivity rate at 5.20 per cent
'భారత్​లో కరోనా పాజిటివిటీ 5.20 శాతం'
author img

By

Published : Feb 22, 2021, 5:48 PM IST

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 5.20 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 21.15 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదివారం 6,20,216 మందికి పరీక్షలు నిర్వహించామంది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం...

  • దేశంలో మొత్తం టెస్టింగ్ ల్యాబ్​లు-2,393
  • ప్రైవేట్ ల్యాబ్​లు -1,173
  • ప్రభుత్వానికి చెందినవని- 1,220

దేశంలో రోజూ ప్రతి 10లక్షల మందిలో 1,53,298కి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • దేశవ్యాప్తంగా టీకాలు అందినవారు- 1,11,16,854
  • వ్యాక్సిన్​ మొదటి డోసు అందినవారు- 63,97,849
  • రెండో డోసు అందినవారు- 9,67,852

ఇప్పటివరకు 37, 51,153 మంది ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకా మొదటి డోసు ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 60.17 శాతం వ్యాక్సిన్​ డోసులు 7 రాష్ట్రాల్లో అందించామని వివరించింది. కర్ణాటకలో అత్యధికంగా 11.8 శాతం టీకా డోసులు వేశామని తెలిపింది.

మహారాష్ట్రలో అత్యధికం

మొత్తం కేసుల్లో 86.3 శాతం.. కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు వివరించింది. మహారాష్ట్రలో రోజూవారి కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది. అధిక మరణాల్లో సైతం మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని తెలిపింది.

భారత్​లో క్రియాశీల కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,50,055 క్రియాశీల కేసులు ఉన్నాయంది. ఇది భారత్​లో మొత్తం కరోనా బారిన పడ్డ వారిలో 1.36 శాతమని వివరించింది.

ఇదీ చదవండి : రెండు వారాల్లోనే కరోనా కేసులు 36% వృద్ధి!

ఇదీ చదవండి : దేశంలో 1.10కోట్లు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.