Maharashtra cases today: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకుంది. మంగళవారం 1,881 కేసులు నమోదు కాగా.. బుధవారం కొత్తగా 2,701 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 78,98,815కు చేరింది. మరణాలు నమోదు కాలేదు. యాక్టివ్ కేసులు పదివేల మార్కుకు చేరువయ్యాయని.. ప్రస్తుతం 9,806 ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 1,327 మంది కోలుకున్నారని పేర్కొంది. 42,018 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 8,11,54,970కు చేరింది.
మరోవైపు రాష్ట్ర రాజధాని ముంబయిలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మంగళవారం 1,242 మంది వైరస్ బారిన పడగా.. బుధవారం 1,765 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 26 తర్వాత అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: విమానాల్లో మాస్కు తప్పనిసరి.. లేదంటే బోర్డింగ్ పాయింట్లోనే..