ఇవర్‌మెక్టిన్ ఔషధం కరోనాను అదుపు చేయగలదని అమెరికా వైద్యనిపుణులు, శాస్రవేత్తలతో కూడిన ఫ్రంట్‌లైన్ కొవిడ్-19 క్రిటికిల్ కేర్ అలయెన్స్ (ఎఫ్ఎల్సీసీసీ) సంస్థ తెలిపింది. దీంతో ఇవర్ మెక్టిన్ ఔషధాన్ని తమ రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి క్లినికల్, సాంకేతిక కమిటీ సిఫార్సు చేసిని మేరకు ఈ డ్రగ్‌ను సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఐవర్ మెక్టిన్తో కరోనాను జయించిన శాస్త్రవేత్తలు!
ఇదీ చదవండి: కొవిడ్‌ను దరిచేరనివ్వని ఇవర్‌మెక్టిన్!
ఏ వయస్సు వారు, ఎలా తీసుకోవాలి?
ప్రభుత్వం ప్రకారం..
- 12మిల్లీగ్రాములు కలిగిన ఇవర్‌మెక్టిన్ ట్యాబ్లెట్లను ప్రతి కుటుంబానికి పంపిణీ చేయనున్నారు.
- 15ఏళ్లు దాటిన వారు రోజుకు రెండు ట్యాబ్లెట్లు చొప్పున, వరుసగా మూడు రోజుల పాటు వేసుకోవచ్చు.
- 10-15సంవత్సరాల వయసు పిల్లలు రోజుకు ఒక్క ట్యాబ్లెట్నే తీసుకోవాలి.
- 2-10ఏళ్ల మధ్య వయసు పిల్లలు వైద్యుని సలహామేరకు మాత్రమే ట్యాబ్లెట్ తీసుకోవాలి.
- రెండేళ్ల లోపు పిల్లలకు ఈ ట్యాబ్లెట్ వేయరాదు.
- ప్రతి కుటుంబానికి 24ట్యాబ్లెట్లను కిట్‌గా ప్రభుత్వం సరఫరా చేయనుంది.
ఇప్పటికే ఈ ఔషధాన్ని గోవా, కర్ణాటక రాష్ట్రాలు తమ ప్రజలుక పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించాయి. కాగా ఇవర్ మెక్టిన్ ఔషధం వాడడం వల్ల కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గిందని బ్రిటన్, ఇటలీ, జపాన్ , స్పెయిన్, వైద్యనిపుణులు తేల్చారని కర్ణాటక ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు.
ఇదీ చదవండి: 'ఐవర్‌మెక్టిన్'తో కరోనా నుంచి రక్ష!