దేశంలో కొత్తగా 1,86,364 మంది(corona cases) వైరస్ బారిన పడ్డారు. గత 44 రోజుల్లో ఇవే అత్యల్పం. కరోనాతో 3,660 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,59,459 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 90.34 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు: 2,75,55,457
- మొత్తం మరణాలు: 3,18,895
- కోలుకున్నవారు: 2,48,93,410
- యాక్టివ్ కేసులు: 23,43,152
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి : కరోనా కట్టడిపై భారత్కు లాన్సెట్ 8 సూచనలు
33.69 కోట్ల పరీక్షలు..
దేశవ్యాప్తంగా గురువారం 20,70,508 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 33,90,39,861కి చేరింది.
ఇదీ చదవండి : 'టీకాలు ముందే కొనాల్సింది.. 200 కోట్ల డోసులు అసాధ్యం'
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 20,57,20,660 వ్యాక్సిన్ డోసులు(corona vaccination) పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి : Covid vaccine: బూస్టర్ డోసు అవసరమా?