ETV Bharat / bharat

షా రివ్యూ తర్వాత దిల్లీలో మారిన 'కరోనా లెక్క'

author img

By

Published : Nov 22, 2020, 12:30 PM IST

దిల్లీలో తొలిసారిగా యాంటీజెన్​ పరీక్షల కంటే ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​లు ఎక్కువగా నిర్వహించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమిత్​ షా ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే ప్రారంభించి ఇప్పటివరకు 3 లక్షల 70 వేల మందికిపైగా పరీక్షలు జరిపినట్లు తెలిపింది.

COVID-19 in Delhi: 3.7 lakh surveyed, first time RT-PCR tests more than antigen tests
యాంటిజెన్​ కంటే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలే ఎక్కువ

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా దిల్లీలో భారీగా నమోదవుతున్నాయి. దీంతో చొరవ తీసుకున్న కేంద్రం... కొవిడ్​ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలిచ్చే ఆర్​టీ-పీసీఆర్​ టెస్ట్​ల సంఖ్యను పెంచింది. ఫలితంగా తొలిసారి యాంటిజెన్​ పరీక్షల కంటే ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలను ఎక్కువగా నిర్వహించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంటింటి సర్వే జరిపి 3.7 లక్షల మందిని పరీక్షించినట్లు పేర్కొంది.

కరోనా నివారణకు ముమ్మర చర్యలు

  • రాజధాని ప్రాంతంలో కొవిడ్​ నివారణలో భాగంగా 3.7 లక్షల మందిని సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు.
  • 250 వెంటిలేటర్లను డీఆర్​డీఓ ఆసుపత్రికి అందించినట్లు పేర్కొన్నారు.
  • దిల్లీ ఎయిమ్స్​ కూడా 207 మంది జూనియర్ రెసిడెంట్​ డాక్టర్లను నియమించే ప్రక్రియను మొదలుపెట్టింది.

దిల్లీలో కొవిడ్​ కేసులు ఒక్కసారిగా పెరగడంపై ఈ నెల 15న అమిత్​ షా నేతృత్వంలో నిర్వహించిన ఓ ఉన్నత స్థాయి సమీక్షలో 12 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కరోనా వ్యాప్తి నివారణ చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చైనా వక్ర బుద్ధి: ఇటు చర్చలు- అటు కుట్రలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.