ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 5కోట్లమంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. అక్కడ నిత్యం 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
మహమ్మారి కాటుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 12 లక్షల 51 వేల 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి 3 కోట్ల 53 లక్షల 67 వేల మందికి పైగా కోలుకున్నారు. గత రెండు రోజులుగా 6 లక్షలకు పైగా కొత్త కేసులు, 8 వేల 5 వందలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. రెండో సారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి.