ETV Bharat / bharat

'సౌండ్ బాక్స్'​పై పోలీసులకు డౌట్.. ఓపెన్ చేస్తే రూ.12కోట్ల డ్రగ్స్​! - మల్జా న్యూస్​

Couple Nabbed With Drugs: డ్రగ్స్​ అక్రమ రవాణా చేస్తున్న జంటను బంగాల్​ పోలీసులు పట్టుకున్నారు. సౌండ్ బాక్స్​లో దాచి తరలిస్తున్న 2.5 కిలోల హెరాయిన్​ను గుర్తించారు. దీని విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Couple Nabbed With Drugs
మ్యూజిక్ ప్లేయర్​లో రూ.12కోట్ల డ్రగ్స్​.. జంట అరెస్ట్​
author img

By

Published : Apr 7, 2022, 3:47 PM IST

Couple Nabbed With Drugs: బంగాల్​లో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న జంటను స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి మాల్దా స్టేషన్​ పరిధిలో 2.5కిలోల హెరాయిన్​ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితులను గోలమ్​ ముస్తఫా, రియాన్​ షఫిన్​గా గుర్తించిన పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు.

నిందితులు ముర్షీదాబాద్‌లోని లాల్‌గోలా నుంచి వచ్చి మాల్దా రైల్వే స్టేషన్‌లో దిగారని పోలీసులు వర్గాలు తెలిపాయి. రైలు దిగిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల నుంచి తెస్తున్న హెరాయిన్​ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిని మ్యూజిక్​ సిస్టమ్​లోని ప్లాస్టిక్ ప్యాకెట్​లో దాచినట్లు చెప్పారు.

Couple Nabbed With Drugs
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న జంట
Couple Nabbed With Drugs
మ్యూజిక్ సిస్టమ్​లో దాచిన డ్రగ్స్​
Couple Nabbed With Drugs
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న జంట

గతంలోనూ మాల్దాలో డ్రగ్స్​ సరఫరా అధికంగా జరిగేది . ఈశాన్య రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి.. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్​కు సరఫరా చేస్తారు. ప్రస్తుతం పోలీసుల నిఘా అధికం కావడం వల్ల ఈ ముఠాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి.

ఇదీ చదవండి: పెళ్లి పేరుతో 200 మంది యువతులకు టోకరా- సర్వం దోచేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.