ETV Bharat / bharat

ఏటీఎం ద్వారా రేషన్​ సరకులు.. దేశంలోనే తొలిసారి - ధాన్యం ఏటీఎం

ఆహార ధాన్యాల కోసం రేషన్​ దుకాణాల ముందు గంటల కొద్దీ వేచిచూడటం, తీరా మన సమయం వచ్చే సరికి సరకులు అయిపోవడం లాంటివి ప్రయాసతో కూడిన పని. ఈ తిప్పలను తప్పిస్తోంది హరియాణా ప్రభుత్వం. బ్యాంకు ఏటీఎం తరహాలో రేషన్​ సరుకుల పంపిణీ ప్రారంభించింది.

Grain ATM
రేషన్ బియ్యం
author img

By

Published : Jul 15, 2021, 10:21 AM IST

Updated : Jul 15, 2021, 11:12 AM IST

ఏటీఎం నుంచి రేషన్ సరుకుల సరఫరా

ఏటీఎంల ద్వారా ఖాతాలోని నగదు తీసుకోవటం అనేది అందరికి తెలుసు. కానీ, అలాంటి ఏటీఎంల ద్వారా రేషన్​ సరకులు వస్తే.. చౌకధరల దుకాణాల ముందు బారులు తీరాల్సిన అవసరం ఉండదు కదా! అలాంటి ప్రయత్నమే చేపట్టింది హరియాణా ప్రభుత్వం. దేశంలోనే తొలి 'రేషన్​ ఏటీఎం'​ను గుడ్​గావ్​లో పైలట్​ ప్రాజెక్ట్​ కింద ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా తెలిపారు. 5 నుంచి 7 నిమిషాల్లో ఈ ఏటీఎం నుంచి 70 కిలోల వరకు ధాన్యం విడుదలవుతుందని వెల్లడించారు.

"ఆహార ధాన్యాల కోసం ఇక నుంచి ఎవరూ ప్రభుత్వ రేషన్ దుకాణాల వద్ద గంటల కొద్దీ నిలబడే అవసరం ఉండదు. హరియాణా ప్రభుత్వం గ్రెయిన్ ఏటీఎం(రేషన్​ సరకుల ఏటీఎం) ద్వారా వాటిని సరఫరా చేయనుంది."

- దుష్యంత్​ చౌతాలా, ఉప ముఖ్యమంత్రి

ధాన్యం ఏటీఎంలతో రేషన్​ షాపుల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెరపడుతుందని చౌతాలా అన్నారు. ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు. తొలి రేషన్​ సరకుల ఏటీఎంను గుడ్​గావ్​లోని ఫరూక్​నగర్​లో ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Grain ATM
ధాన్యం ఏటీెఎం వద్ద లబ్ధిదారుడు

ఎలా పనిచేస్తుందంటే..

బ్యాంకు ఏటీఎం లానే రేషన్​ సరకుల ఏటీఎం పనిచేస్తుంది. ఇందులో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. టచ్​స్క్రీన్​ ద్వారా లబ్ధిదారుడు ఆధార్​ లేదా రేషన్​ ఖాతా నెంబర్​ పొందుపరచాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ జరగగానే, వారికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్​గా సంచుల్లో నింపేస్తుంది. దీని ద్వారా బియ్యం, గోధుమ, చిరుధాన్యాలు సరఫరా చేయవచ్చు.

ఇదీ చూడండి: Vaccination: కరోనా టీకా​ తీసుకున్నవారికే రేషన్​!

Last Updated : Jul 15, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.