ETV Bharat / bharat

యంగ్ మేయర్.. యువ ఎమ్మెల్యే.. త్వరలో ఏడడుగులు! - కేరళ ఎమ్మెల్యే సచిన్ దేవ్ వివాహం

Youngest Mayor Arya Rajendran marriage: ఒకరేమో అతిపిన్న వయసులో మేయర్ పీఠం ఎక్కిన వ్యక్తి... మరొకరు రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యే.. ఈ ఇద్దరు యువ రాజకీయ నేతలు ఒక్కటి కాబోతున్నారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

Youngest Mayor Arya Rajendran marriage
Youngest Mayor Arya Rajendran marriage
author img

By

Published : Feb 16, 2022, 3:15 PM IST

Youngest Mayor Arya Rajendran marriage: దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్​గా వార్తల్లోకెక్కిన ఆర్యా రాజేంద్రన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్​ను ఆమె వివాహం చేసుకోనున్నారు. సచిన్ దేవ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. నెల రోజుల్లోనే వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Arya Rajendran Sachin Dev

బలుస్సెరీ అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్​గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా సీపీఎం తరఫున పోటీ చేశారు ఆర్య. 21 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎన్నికై.. దేశం దృష్టిని ఆకర్షించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సెక్రెటరీగా ఉన్న సమయంలో సచిన్ దేవ్​కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది సీపీఎం. 2021 ఎన్నికల్లో బలుస్సెరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి గెలుపొందారు. కోజికోడ్​కు చెందిన సచిన్.. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: వృద్ధుడిని మోస్తూ మంచులో 16.కి.మీ సాహస యాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.