మహమ్మారి కరోనా (COVID Pandemic) యావత్ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే విషయాన్ని విద్యార్థులకు ఓ పాఠ్యాంశంలా బోధించాలని (Covid lessons for students) నిర్ణయించింది బంగాల్ సర్కార్. ఇకపై బెంగాల్ ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లోని 11వ తరగతిలో 'హెల్త్ అండ్ ఫిజకల్ ఎడ్యుకేషన్' సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌కు (coronavirus) సంబంధించిన పూర్తి అంశాలను బోధించనున్నారు. ఇందులో కరోనా అంటే ఏమిటి? (what is coronavirus) అది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది? (How covid transmits) వైరస్ లక్షణాలేమిటి? (Covid symptoms) క్వారంటైన్‌కి సంబంధించిన తదితర వివరాలు పూర్తిగా ఉంటాయి.
అంతే కాదు.. 11వ తరగతికి మాత్రమే కాకుండా 6-10వ తరగతి పాఠ్యాంశాల్లో బోధించాలని యోచిస్తోంది బెంగాల్ ప్రభుత్వం. ఈమేరకు అలాంటి ఆలోచనలతో ముందుకు రావాలని సలహా కమిటీ ప్రభుత్వానికి సూచించింది. విద్యాశాఖకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ.. "కొవిడ్ వల్ల మన ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది. అందుకే విద్యార్థులకు దీని మీద కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అన్నారు.
అవగాహన మంచిదే
ఇదే విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటు వ్యాధుల నిపుణులు డా. యోగిరాజ్ రాయ్ మాట్లాడుతూ.. "కరోనా వైరస్ గురించి పాఠ్యాంశాల్లో చేర్చడమనేది ఓ మంచి నిర్ణయం. పిల్లలకు కనుక దీని మీద అవగాహన (awareness of Covid 19) వస్తే.. ముందస్తు నిర్ధరణకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ (Vaccination of covid 19) కూడా త్వరగా పూర్తవుతుంది" అన్నారు. ప్రజా ఆరోగ్య నిపుణులు కాజల్ కృష్ణ బానిక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్యం నుంచే పిల్లలకు అవగాహన తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. తద్వారా సమాజంలో కరోనా అంటే భయంపోతుందన్నారు.
ఇదీ చదవండి: జాతీయోద్యమంలో ఆక్స్‌ఫర్డ్ అమ్మాయి ప్రేమకథ