దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 43,071 మందికి కొవిడ్ సోకింది. వైరస్ నుంచి 52,299 మంది కోలుకోగా.. 955మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 97.09 శాతంగా నమోదైంది.
- మొత్తం కేసులు : 3,05,45,433
- మొత్తం మరణాలు : 4,02,005
- కోలుకున్నావారు : 2,96,58,078
- యాక్టివ్ కేసులు : 4,85,350
వ్యాక్సినేషన్...
టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 35,12,21,306 మందికి టీకా పంపిణీ చేశారు.
జులై 3వ తేదీ వరకు మొత్తం 41,82,54,953 నమూనాలు పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం ఒక్కరోజే.. 18,38,490 పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు.. ఆరు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. వైరస్ కట్టడికి ప్రత్యేక అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రజలు కొవిడ్ నిబంధనలను తేలిగ్గా తీసుకుంటే మూడో దశ ఉద్ధృతి తప్పదని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.