దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 37,566 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 907 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 56,994 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.87 శాతంగా నమోదైంది. 102 రోజుల తర్వాత 40వేల కన్నా తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
- మొత్తం కేసులు : 3,03,16,897
- మొత్తం మరణాలు : 3,97,637
- కోలుకున్నావారు : 2,93,66,601
- యాక్టివ్ కేసులు : 5,52,659
మొత్తం టెస్టులు..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40,81,39,287 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 17,68,008 మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32,90,29,510 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే.. 52,76,457 మందికి వ్యాక్సిన్ అందినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : బీటా వేరియంట్‌పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?