Corona Cases in India : దేశంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 9,436 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 30 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఒక్కరోజులో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,08,132
- క్రియాశీల కేసులు: 86,591
- మొత్తం మరణాలు: 5,27,754
- కోలుకున్నవారు: 4,37,93,787
Vaccination In India : దేశంలో ఆదివారం 26,53,964 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,11,66,35,408కు చేరింది. ఒక్కరోజే 3,22,551 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 527,580 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,216 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 605,328,762 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 64,86,863 మంది మరణించారు. శనివారం మరో 7,52,893 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,95,87,894కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 196,628 కేసులు వెలుగుచూశాయి. మరో 126 మందికిపైగా మరణించారు.
- దక్షిణ కొరియాలో 95,538 కొవిడ్ కేసులు, 86 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో 21,986 కొత్త కేసులు, 81 మరణాలు వెలుగుచూశాయి.
- ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి: ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం, కారు బోల్తా పడి మరో ఐదుగురు