కేరళలో కరోనా (Corona cases) కేసులు స్వల్పంగా పెరిగాయి. అక్కడ కొత్తగా 11,079 కేసులు నమోదయ్యాయి. మరో 9,972 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 123 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 26,571కి చేరింది.
మిజోరంలో కొత్తగా 1,224 కరోనా కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో 237 మంది చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు చనిపోయారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- దేశ రాజధాని దిల్లీలో 31 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
- కర్ణాటకలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 615 మందికి కరోనా సోకగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: