ETV Bharat / bharat

కష్టాలను ఎదిరించిన సరస్వతీ పుత్రులు.. ఇద్దరికే 23 గోల్డ్ మెడల్స్​​

Mysore University News: బాల్యం నుంచే కష్టాలు ఎదురైనా చదువులో విశేషంగా రాణించారు కర్ణాటకు చెందిన ఇద్దరు విద్యార్థులు. ఒకరు ఎంఏలో 14 గోల్డ్​ మెడల్స్ సాధించగా.. మరొకరు బీఏలో 9 బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వీళ్ల కన్నీటి గాథ తెలిస్తే ఎవరైనా అభినందిస్తారు.

Convocation Of University Of Mysore:
కష్టాలను ఎదిరించిన సరస్వతీ పుత్రులు.. ఇద్దరికే 23 గోల్డ్ మెడల్స్​​
author img

By

Published : Mar 23, 2022, 1:46 PM IST

Mysore University Gold Medals: చదువుపై ఆసక్తి ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమించవచ్చని నిరూపించారు కర్ణాటకకు చెందిన పీ మహాదేవస్వామి, వీ తేజశ్విని. ఇద్దరూ చిన్నప్పుడే కుటుంబ పెద్దలను కోల్పోయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఎన్ని కష్టాలొచ్చినా చదువు మాత్రం ఆపలేదు. ఇప్పుడు యూనివర్సిటీలో గోల్డ్​ మెడల్స్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంగళవారం జరిగిన మైసూర్​ యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో మహాదేవస్వామి 14 గోల్ట్ మెడల్స్​, 3 నగదు బహుమానాలు గెలుపొందగా.. తేజశ్విని 9 గోల్డ్ మెడల్స్​తో పాటు 10 క్యాష్ ప్రైజ్​లు కైవసం చేసుకుంది.

Convocation Of University Of Mysore
9 గోల్డ్​ మెడల్స్ సాధించిన తేజస్విని

MA Gold Medals : మహాదేవస్వామికి ఈ మెడల్స్ అన్నీ ఎంఏ కన్నడలో వచ్చాయి. చామరాజనగర్​లోని డా. బీఆర్ అంబేడ్కర్​ యూనివర్సిటీలో పీజీ చేశాడు. నాగవల్లికి చెందిన ఇతని తండ్రి 20 ఏళ్ల క్రితమే మరణించాడు. అప్పటి నుంచే అమ్మ అన్నీ తానై చూసుకుంది. ఇతడ్ని చదివించేందుకు రోజూ కూలీ పని చేసేది. అయినా మహాదేవస్వామి ఏనాడు చదువుపై ఆసక్తి కోల్పోలేదు. ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చుల కోసం మేస్త్రీగా, పెయింటర్​గా కూడా పని చేశాడు. ఇప్పుడు 14 మెడల్స్​ సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. తాను భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి అయి సమాజానికి సేవ చేస్తానని చెబుతున్నాడు.

Convocation Of University Of Mysore
14 గోల్డ్ మెడల్స్ సాధించిన మహాదేవస్వామి

Karnataka Students Gold Medal : తేజశ్విని కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. మాలవల్లికి చెందిన ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. మహారాణి ఆర్ట్స్​ కాలేజీలో బీఏ పూర్తి చేసింది. అమ్మానాన్న లేకపోవడం వల్ల హాస్టళ్లలోనే చదువుతూ పెరిగింది. తన పెద్దక్క, స్నేహితులు అందించిన సహకారంతోనే బాగా చదువుకున్నట్లు చెప్పింది. బీఏలో 9 గోల్డ్ మెడల్స్ రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. తనకు ఆర్థికంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. పీజీ పూర్తి చేయడమే తన తదపురి లక్ష్యమని పేర్కొంది.

Convocation Of University Of Mysore
9 గోల్డ్​ మెడల్స్ సాధించిన తేజస్విని

మైసూర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. దివంగత కన్నడ నటుడు పునీత్​ రాజకుమార్​ను మరణానంతరం డాక్టరేట్​తో గౌరవించారు. పునీత్ తరఫున ఆయన సతీమణి అశ్విని అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పునీత్​ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు.

ఇదీ చదవండి: 45ఏళ్ల భర్తను వదిలి.. 22ఏళ్ల ప్రేమికుడితో వెళ్లి.. 25సిమ్​లు మార్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.