ETV Bharat / bharat

రెబల్ అభ్యర్థులతో ప్రధాన పార్టీల సంప్రదింపులు - ఎన్నికల బరిలో లేకుండా బుజ్జగింపులు

Consultation With Rebel Candidates in Assembly Elections : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోరులో అన్ని పార్టీలకు రెబల్స్‌ బెడదతో గుబులు రేగుతోంది. పార్టీ టిక్కెట్ ఆశించిన ఆశావహులు నుంచే ప్రధానంగా ఓట్ల చీలుతాయన్న భయం ప్రధాన పార్టీలలో సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అదిష్ఠానం రంగంలోకి దిగి.. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడింది. బుజ్జగింపుల

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 6:36 AM IST

Appeasement Without Contesting Elections
Consultation With Rebel Candidates in Assembly Elections
రెబల్ అభ్యర్థులతో ప్రధాన పార్టీల సంప్రదింపులు- ఎన్నికల బరిలో లేకుండా బుజ్జగింపులు

Consultation With Rebel Candidates in Assembly Elections : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరులో అన్ని పార్టీలకు రెబల్స్‌ బెడదతో గుబులు రేగుతోంది. ప్రధానంగా టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాటుదారులుగా ఎన్నికల బరిలో ఉండటం కాంగ్రెస్ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. పోటీ ఎక్కువ ఉన్నచోట ఓట్లు చీల్చితే.. తలరాత తారుమారు అవుతుందని భయపడుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగి బుజ్జగింపులతో అసంతృప్తులను సముదాయిస్తోంది.

ఓట్లు చీలకుండా రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ అధిష్ఠానం : పోటీ నుంచి తప్పుకునేలా విశ్వప్రయత్నాలు(World Endeavours) చేస్తోంది. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో తిరుగుబాటు అభ్యర్థులను కాంగ్రెస్‌ నాయకత్వం బుజ్జగిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్.. రెబల్స్‌తో సమావేశమై వారిని సముదాయిస్తున్నారు. సూర్యాపేట, బోథ్‌, వైరా, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్, వరంగల్ పశ్చిమ, నర్సాపూర్‌ ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రంగా లేదా ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

'తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటోంది'

Dissent Leaders Issue in Political Parties : ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న ఠాక్రే.. నామినేషన్లు వెనక్కి తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని సూచిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం వస్తే నామినేటెడ్‌ పదవులు(Nominated Posts) ఇస్తామని వారికి భరోసా ఇస్తున్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా తిరుగుబాటు చేసిన వారు తగ్గుతారా.. లేదంటే పోటీకి సిద్ధమవుతారా..? అనేది బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌ రెడ్డి, ఆదిలాబాద్‌లో సంజీవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి తదితరులు బలమైన నాయకులుగా ఉన్నారు. ఓట్లలో చీలిక రాకుండా కాంగ్రెస్‌ అధినాయకత్వం చర్యలు చేపడుతోంది.

పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారు: బండి సంజయ్

బీజేపీ తరఫున షాద్‌నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి.. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీచేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడానికి కమలం పార్టీ యత్నిస్తోంది. జూబ్లీహిల్స్‌ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy).. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో సమావేశమయ్యారు. నవీన్ యాదవ్‌, శ్రీశైలం యాదవ్‌ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో కమలం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని అభ్యర్థించారు.

BRS Dissatisfaction Leaders : బీఆర్​ఎస్​ పార్టీలోనూ సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారనే ప్రచారం ముందునుంచీ జరిగినా.. కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఎంతగానో ఆశించారు. అలాంటి వారికి చుక్కెదురైంది. పలుచోట్ల సిట్టింగ్​ ఎమ్మెల్యేలపై(Sitting MLA) తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్యనేతలు కావడం వల్ల అధిష్ఠానం వారిని దూరం చేసుకోవద్దనే తపనతో బుజ్జగింపులు మొదలుపెట్టింది. షెడ్యూల్‌ రావడానికి ముందే కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ల పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలు ఇస్తోంది. బీఆర్​ఎస్​లో అసమ్మతితో పార్టీ నేతలను కాపాడుకోవడం గులాబీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది.

కాంగ్రెస్​ రెబెల్స్​ను బుజ్జగించే పనిలో ఉన్న కాంగ్రెస్​ అధిష్ఠానం

మంది మాటలు విని ఓటేస్తే ఐదేళ్లు ఇబ్బంది పడతాం : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.