ETV Bharat / bharat

'మంత్రుల సంఖ్య మాత్రమే పెరిగింది.. వ్యాక్సిన్లు కాదు' - టీకా పంపిణీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

కేంద్ర కేబినేట్ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మంత్రుల సంఖ్య పెరిగిందే తప్ప.. కరోనా టీకాల సంఖ్య ఏమాత్రం వృద్ధికాలేదని విమర్శించారు.

Rahul
రాహుల్ గాంధీ
author img

By

Published : Jul 11, 2021, 9:36 PM IST

టీకా పంపిణీ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. వ్యాక్సిన్ల కొరతను ప్రశ్నించిన ఆయన.. ఈ సమస్యను తాజా కేబినేట్ విస్తరణతో అనుసంధానించారు. కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోందని.. ఇలా అయితే ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ టీకా అందించే లక్ష్యాన్ని చేరుకోలేమని వ్యాఖ్యానించారు.

"మోదీ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య మాత్రమే పెరిగింది. కానీ వ్యాక్సిన్ల సంఖ్య ఏమాత్రం పెరగలేదు."

-ట్విట్టర్​లో రాహుల్ గాంధీ

ఇటీవల చేపట్టిన కేంద్ర కేబినేట్ విస్తరణతో మోదీ ప్రభుత్వంలోని మంత్రుల సంఖ్య 43 నుంచి 77కి పెరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వ్యాక్సిన్లు ఎక్కడ?..

ఒక రోజుకు పంపిణీ చేయాల్సిన టీకాలకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్​లో పంచుకున్నారు. దీనికి టీకాలు ఎక్కడ?(వేర్​ ఆర్ వ్యాక్సిన్స్) అనే హ్యాష్​ట్యాగ్​ను జతచేశారు. ప్రస్తుత వేగంతో ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ టీకాలు వేసే లక్ష్యం నెరవేరదని విమర్శించారు.

విమర్శలు- ప్రతి విమర్శలు..

గతకొన్నాళ్లుగా దేశంలో టీకా పంపిణీ విధానం.. వ్యాక్సిన్ల కొరతపై కాంగ్రెస్ వరుస విమర్శలు చేస్తోంది. టీకా పంపిణీని వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. మూడో దశ మహమ్మారి ముప్పును ఆపేందుకు టీకా పంపిణీయే ఏకైక మార్గమని సూచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ విమర్శలపై భాజపా సైతం దీటుగా బదులిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావాలనే టీకా కొరత సృష్టిస్తోందని ఆరోపించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.