ETV Bharat / bharat

ఆయన సరైనోడే.. కానీ పార్టీ..? - కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీపై మహారాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ సరైన నేత.. కానీ ఆయన  ఉన్న పార్టీయే సరైంది కాదని అన్నారు. కొవిడ్‌ కట్టడిలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

nitin gadkari
నితిన్‌ గడ్కరీ
author img

By

Published : May 31, 2021, 6:41 AM IST

కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీపై మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు అశోక్‌ చవాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"నితిన్‌ గడ్కరీ సరైన నేత. కానీ ఆయన ఉన్న పార్టీయే సరైంది కాదు" అని అశోక్‌ చవాన్‌ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం చవాన్‌ వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంలో తాను అభిమానించే మంత్రి ఎవరైనా ఉన్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చవాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గడ్కరీకి మహారాష్ట్ర అభివృద్ధిపై సానుకూల ధోరణి ఉందన్నారు. కానీ కేంద్రంలో పెద్దలు ఆయన అధికారాలను క్రమంగా తగ్గిస్తూ వచ్చారని పేర్కొన్నారు.

అందులో విఫలం..

కొవిడ్‌ కట్టడిలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మోదీ పాలనలో లీటరు పెట్రోలు ధర రూ.100 మించిపోయిందన్నారు. సుమారు 12.21 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. సర్వాధికారాలను తమ చేతుల్లో పెట్టుకొని.. కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతం కావడంతో కేంద్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తోందని ఆరోపించారు. భారత్‌ కన్నా బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయమే ఎక్కువని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. జీఎస్టీ పరిహారం సహా అన్ని విధాల సహాయ సహకారాల్లో మహారాష్ట్రపై కేంద్రం వివక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తోందంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాల్లో మరాఠా కోటాకు సంబంధించి రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం అన్ని పార్టీల నేతలతో చర్చిస్తున్నందుకు రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత శంభాజీ ఛత్రపతిని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి : 'సంతృప్తికరంగానే ఆర్మీ ఆధునికీకరణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.