అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల లెక్కలు చెప్పాలని భాజపాను డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్. రామాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యే బ్రజ్మోహన్ అగర్వాల్ కోరిన నేపథ్యంలో.. ఈ మేరకు స్పందించారు బఘేల్. 1992 నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు సేకరించారో చెప్పాలని ప్రశ్నించారు.
బఘేల్ వ్యాఖ్యలపై అంతే తీవ్రంగా స్పందించారు బ్రజ్మోహన్. ఈ నిధుల విషయంలో కాంగ్రెస్ ఎలాంటి సహకారం అందించలేదని, ఆ పార్టీకి లెక్కల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. అయితే.. తాము కోరినట్టు నిధుల్ని సమకూరిస్తే.. సంబంధిత లెక్కలన్నింటినీ వివరించేందుకు తాము సిద్ధమని చెప్పారు అగర్వాల్.
ఇదీ చదవండి: 'అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి'