ETV Bharat / bharat

Congress on Agniveer Scheme : అగ్గితో ఆట! అగ్నిపథ్​కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యూహం.. 5రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ - congress campaign on agnipath

Congress on Agniveer Scheme : ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఓ సున్నితమైన అంశాన్ని లేవనెత్తుతోంది. యువత మద్దతు కూడగట్టుకోవాలన్న ఉద్దేశంతో అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపడుతోంది.

Agniveer vs Normal Recruitment congress campaign

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 5:11 PM IST

Congress on Agniveer Scheme : సైనిక బలగాల నియామకం కోసం ఎన్​డీఏ సర్కారు ప్రవేశపెట్టిన అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా యువత మద్దతును కూడగట్టుకునేందుకు అగ్నిపథ్​పై ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్​ పార్టీకి చెందిన మాజీ సైనికుల విభాగం ఇప్పటికే ఈ విషయంపై ఓ సదస్సు నిర్వహించింది. మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో రెండు నెలల క్రితం విస్తృత చర్చలు జరిపింది. ఈ విభాగం ఆధ్వర్యంలో రాజస్థాన్​లోని అల్వార్​లో ఓ ఫుట్ మార్చ్ సైతం జరిగింది. అక్టోబర్ 29న రాజస్థాన్​లోని ఝుం​ఝునూ, మండావా ప్రాంతాల్లో మరో రెండు ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

Congress Campaign Against Agniveer : అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరిన జవాన్లు యుద్ధానికి సిద్ధంగా ఉండే అవకాశం తక్కువ అని కాంగ్రెస్ పార్టీ మాజీ సైనికుల విభాగం ఛైర్మన్ విశ్రాంత కర్నల్ రోహిత్ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అగ్నివీరుడికి తగిన పరిహారం ఇవ్వడం లేదని అన్నారు. సాధారణ సైనికులకు, అగ్నివీరులకు అనేక తేడాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

"అగ్నిపథ్ వల్ల సైన్యంలో రెండు రకాల జవాన్లు తయారవుతారు. ఇది సైనిక దళాలను దెబ్బతీస్తుంది. దీన్ని మేం వ్యతిరేకిస్తూనే వస్తున్నాం. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీన్ని ప్రాధాన్యంగా తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సమస్యపై రాజస్థాన్, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో గళమెత్తుతాం. ఎన్నికల ఫలితంపై ఈ సమస్య ప్రభావం ఉంటుందని భావిస్తున్నాం. సాయుధ దళాలపై బలవంతంగా రుద్దిన ఈ స్కీమ్​ను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. సాధారణ సైనికుడికి, అగ్నివీర్​కు మధ్య తేడా ఏంటనేది మా ర్యాలీలలో చెబుతున్నాం."
- విశ్రాంత కర్నల్ రోహిత్ చౌదరి, కాంగ్రెస్ మాజీ సైనికుల విభాగం ఛైర్మన్

Agniveer vs Normal Recruitment : 'అగ్నివీర్ శిక్షణకు, సాధారణ సైనికుల శిక్షణకు చాలా తేడా ఉంది. సాధారణ సైనికుడికి యుద్ధానికి సన్నద్ధంగా ఉండేలా శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా వారిని మోహరించవచ్చు. ఆరు నుంచి ఎనిమిదేళ్ల వరకు వారు పని చేస్తారు. ఏడాదిన్నర ట్రైనింగ్ తర్వాత నాలుగు నుంచి ఆరేళ్ల పాటు వివిధ యుద్ధ కోణాల గురించి శిక్షణ పొందుతారు. కానీ, అగ్నివీర్ మాత్రం ఆరు నెలల శిక్షణ పొందుతారు. ఏడాది లీవ్ ఉంటుంది. రిటైర్ అవ్వాడానికి రెండున్నర సంవత్సరాల ముందు వారిని డిప్లాయ్ చేస్తారు' అని విశ్రాంత కర్నల్ చౌదరి పేర్కొన్నారు.

'సమానంగా గౌరవించుకోవాలి'
'సాధారణ సైనికులతో పోలిస్తే అగ్నివీరులు యుద్ధానికి సిద్ధంగా ఉండరు. కఠినమైన ప్రాంతాల్లో మోహరించేలా వారికి శిక్షణ అందదు. ఒకే యూనిట్​లో రెండు రకాల సైనికులు ఏర్పడతారు. వారి మధ్య వేతనాల్లో తేడా ఉంటుంది. డ్యూటీలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అందించే పరిహారం విషయంలోనూ భారీ వ్యత్యాసం ఉంటుంది. సాధారణ సైనికుడితో పోలిస్తే అగ్నివీర్​కు ఇచ్చే పరిహారం తగినంతగా లేదు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న మన సైనికులను సమానంగా గౌరవించుకోవాలి' అని కర్నల్ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

'ఆర్థిక కోణంలో చూడొద్దు'
అగ్నివీర్​లను కఠినమైన ప్రాంతాల్లో మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇలా చేస్తే దేశ సరిహద్దులను రక్షించడం సాధ్యమా అని కర్నల్ ప్రశ్నించారు. ఒక్కో అగ్నివీర్​పై ప్రభుత్వం రూ.11 లక్షలు వెచ్చిస్తోందని గుర్తు చేసిన ఆయన.. ఈ ఖర్చుతో పూర్తిస్థాయి సైనికుడిని తయారు చేసుకోవచ్చని అన్నారు. అయితే, ఈ విషయాన్ని ఆర్థిక కోణంలో చూడకూడదని పేర్కొన్నారు.

22 Crucial Seats In MP : తాడోపేడో తేల్చే ఆ 22 సీట్లు.. ముస్లిం ఓటు బ్యాంక్​పై కాంగ్రెస్ ఆశలు!.. అధికారం కైవసం చేసుకుంటుందా?

Madhya Pradesh Bundelkhand Election : అభివృద్ధితో బీజేపీ.. కులగణనతో కాంగ్రెస్.. అధికారాన్ని కట్టబెట్టే బుందేల్​ఖండ్ ఎవరివైపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.