ETV Bharat / bharat

షరతుల్లేకుండా కాంగ్రెస్​లోకి ప్రశాంత్​ కిశోర్​- జగన్​తో పొత్తుకు వ్యూహం! - Prashant Kishor congress

Prashant Kishor Congress: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయానికి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​ కీలక సూచనలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని.. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాతో జట్టు కట్టాలని సూచించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ బయటికొచ్చింది. అలాగే ఆయన త్వరలో కాంగ్రెస్​లో బేషరతుగా చేరనున్నట్లు తెలుస్తోంది.

prashant kishor
షరతుల్లేకుండా కాంగ్రెస్​లోకి ప్రశాంత్​ కిశోర్​- జగన్​తో పొత్తుకు వ్యూహం!
author img

By

Published : Apr 22, 2022, 7:00 AM IST

Updated : Apr 22, 2022, 8:07 AM IST

Prashant Kishor News: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పునరుత్థానానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని.. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాతో జట్టు కట్టాలని సూచించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ బయటికొచ్చింది. తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లడం మేలని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారు. జమ్మూ-కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సూచించారు. ఈ పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో 128 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు ప్రశాంత్‌ కిశోర్‌ ఉటంకించారు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన సీట్లన్నీ కలిపితే 377 అవుతాయని, వచ్చే ఎన్నికల్లో వీటిపై దృష్టి సారిస్తే భారీగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భాజపాతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసి, మిగిలిన చోట్ల 5-6 పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకుంటే పార్టీ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయని ప్రతిపాదించారు.

సంస్థాగత మార్పులు కూడా..: కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు కూడా చేపట్టాలని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఇందుకుగాను రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. 1 - యూపీఏ ఛైర్‌పర్సన్‌గా పాతతరం కాంగ్రెస్‌ నాయకుడిని పెట్టి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడం. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకోవడం. కోఆర్డినేషన్‌ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని నియమించడం. (లేదా) 2 - సోనియాను యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడం, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీ, కోఆర్డినేషన్‌ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని ఎన్నుకోవడం. రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్టసభలో ప్రధాని ‘వర్సెస్‌’ రాహుల్‌ గాంధీగా మారుతుందని, దీనివల్ల ప్రజల గొంతును పార్లమెంటు లోపల, బయట బలంగా వినిపించడానికి వీలవుతుందని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఇకమీదట పార్టీలో ‘ఒక వ్యక్తి - ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా 15 వేల మంది నిబద్ధత గల నాయకులను, కోటి మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగతంగా రెండు విధాలుగా పని చేయాలని సూచించారు. ఒక విభాగం కాంగ్రెస్‌ను ‘పాన్‌ ఇండియా పార్టీ’గా విస్తరించడంపై దృష్టి సారిస్తే, రెండో విభాగం 2024 ఎన్నికలకు అవసరమైన బలమైన వ్యవస్థను సృష్టించే పనిలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు.

షరతుల్లేకుండా..: గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్న ప్రశాంత్ కిశోర్​ పార్టోలో​ చేరడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. శుక్రవారం కూడా సోనియాతో మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 'అతను బేషరతుగా పార్టీలో చేరాలనుకుంటున్నారు. ఇది మంచి విషయమే. అతను తెలివైన విశ్లేషకుడు. ఆయన్ను చేర్చుకుంటే పార్టీకి కచ్చితంగా మేలు జరుగుతుంది' అనికాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి, సిడబ్ల్యూసీ సభ్యుడైన తారిక్​ అన్వార్ గురువారం తెలిపారు. సలహాదారుడిగా కాంగ్రెస్​లోకి కిశోర్​ చేరతారన్న ఉహాగానాలకు తారిక్​ తెరదించారు. 'వ్యూహకర్త ఉద్యోగాన్ని వదిలేశానని ఆయనే చెప్పారు. పార్టీలో చేరి తన అనుభవాన్ని మాత్రమే పంచుకోవాలనుకుంటున్నారు' అని చెప్పారు. పార్టీ ఎన్నికల జాతీయ కార్యదర్శిగా కిశోర్​ను నియమించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిశోర్ రాకను పార్టీలో కొందరు సీనియర్​ నాయకులు వ్యతిరేకిస్తున్నారన్న అంశంపై తారిక్​ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్​లో ఒక్కరే నిర్ణయం తీసుకోరు. అధ్యక్షురాలే మా సుప్రీం నేత. ఆమె పార్టీలోని సీనియర్ నేతలందరితోనూ ఈ విషయంపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రెండు రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే కిశోర్ చేరికపై సోనియా ఓ నిర్ణయం తీసుకుంటారు' అని తారిక్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆపరా?: సుప్రీం

Last Updated : Apr 22, 2022, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.