కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కుమార్, తన భర్తతో కలిసి రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో ధర్నా చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేసిన తమ బంధువుల అబ్బాయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'పిల్లలంతా మద్యం తాగుతారు' అని మీనా కన్వర్ చెప్పడం ఆ వీడియోలో వినిపించింది.
"మా బంధువుల కుమారుడిని, అతనితో పాటు ఉన్నవారిని విడుదల చేయాలని పోలీసులను కోరాను. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. నాతో, నా భర్తతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ నాకు హామీ ఇచ్చారు."
-మీనా కన్వర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: కశ్మీర్లో పౌరుల హత్యలపై ఎన్ఐఏ దర్యాప్తు'
ఇదీ చూడండి: బస్సును కొట్టేసి పరారైన దొంగలు.. కానీ...