ETV Bharat / bharat

యూపీలో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్​ - యూపీ అసెంబ్లీ ఎన్నికలు

Uttar Pradesh polls: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు 125 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. ఇందులో 40 శాతం మహిళలు, 40శాతం యువకులకు అవకాశం ఇచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఇది రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Priyanka Gandhi Vadra releases party's first list of 125 candidates for Uttar Pradesh polls
యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా- ఉన్నావ్ బాధితురాలి తల్లికి టికెట్​
author img

By

Published : Jan 13, 2022, 12:56 PM IST

Uttar Pradesh polls: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా 125 మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. ఇందులో 40శాతం మంది మహిళలు, 40శాతం మంది యువకులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. తమ చారిత్రక నిర్ణయంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆశిస్తున్నట్లు ప్రియాంక అభిప్రాయపడ్డారు.

UP assembly polls congress candidates

125 మంది జాబితాలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్​కు కూడా టికెట్​ కేటాయించినట్లు ప్రియాంక వెల్లడించారు. గౌరవవేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్​ పూనమ్​ పాండే షాజహాన్​పుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తొలి జాబితాలో మొత్తం 50మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం 403 స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. అయితే కాంగ్రెస్ మినహా ఏ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

ఇదీ చదవండి: భాజపా సీఈసీ భేటీ- యూపీ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.