భాజపాను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైనందున ఆ బాధ్యతను ప్రజలు తమపై పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee News) పేర్కొన్నారు. 'ఫాసిస్టు భాజపాను బహిష్కరించి, సరికొత్త భారత్‌ను(Tmc National Politics) నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారని' చెప్పారు. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాపై విజయం సాధించడం ద్వారా టీఎంసీ దేశ ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. ఈ మేరకు 'దిల్లీ పిలుపు'(Dilli r Daak) పేరుతో టీఎంసీ అధికార పత్రిక 'జాగో బంగ్లా'లో మమత(Mamata Banerjee News) ఓ వ్యాసం రాశారు.
"అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని భాజపా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడతోంది. ప్రస్తుతం టీఎంసీ ముందు ఉన్న కొత్త సవాలు- దిల్లీ పిలుపు. ప్రజా వ్యతిరేక విధానాలు, రాజకీయాల నుంచి ఈ దేశ ప్రజలు విశ్రాంతి కోరుకుంటున్నారు. నియంత శక్తులను ఈ దేశం నుంచి బహిష్కరించాలని ఆశిస్తున్నారు."
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో(West Bengal Assembly Election) భాజపాను ఓడించిన తర్వాత.. దేశ రాజకీయాలపై మమత(Tmc National Politics) దృష్టి సారించారు. జులైలో దిల్లీకి వెళ్లిన ఆమె.. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా వ్యతిరేక పార్టీలతో సమాలోచనలు జరిపారు.
"టీఎంసీతో దేశ ప్రజలు.. నూతన భారత్ నిర్మితమవుతుందని కలలు కంటున్నారు. బంగాల్‌ను దాటి వివిధ రాష్ట్రాల నుంచి టీఎంసీకి పిలుపు అందుతోంది. నవ భారత్ నిర్మాణంలో బంగాల్ నేతృత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వారి పిలుపునకు స్పందిస్తామని మేం చెబుతున్నాం. ప్రజల కోరికను నెరవేర్చేందుకు భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ ఒకే వేదికపైకి తేవాలి"అని మమత తన వ్యాసంలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాస్తవం గ్రహించాలి..
భాజపా వ్యతిరేక ఐక్య వేదిక నుంచి కాంగ్రెస్‌ను దూరం పెట్టాలని తాను ఎప్పుడూ ఆలోచించలేదని మమత(Mamata Banerjee News) తెలిపారు.
"కానీ, వాస్తవమేంటంటే.. ఇటీవలి పరిణామాలను గమనిస్తే భాజపా వ్యతిరేక పోరులో కాంగ్రెస్ విఫలమైంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అది నిరూపితమైంది. కేంద్రస్థాయిలో భాజపాను ఎదుర్కోకపోతే అది ఎందరి ధైర్యాన్నో దెబ్బతీస్తుంది. దానివల్ల రాష్ట్రాల్లో భాజపా మరిన్ని ఓట్లు గెలుచుకుంటుంది. ఈసారి మేం ఇలా జరగనివ్వాలని అనుకోవటం లేదు. ఈ కూటమికి అలాంటి నాయకత్వం మాకు అవసరం లేదు. కానీ, కాంగ్రెస్ వాస్తవమేంటో అంగీకరించాలి. లేదంటే.. కూటమిలో భేదాభిప్రాయాలు వస్తాయి. దేశవ్యాప్తంగా భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న అలాంటి కూటమిలో ఈ తరహా పొరపొచ్చాలు ఉండకూడదు. "
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి.
భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబోయే కూటమికి నాయకత్వం వహించేందుకు టీఎంసీ సిద్ధంగా ఉందనే పరోక్షంగా సూచనలు ఇచ్చారు మమత. టీఎంసీ అభివృద్ధి మోడల్‌తో భాజపా ప్రణాళికలు దెబ్బతిన్నాయని చెప్పారు. భాజపాకు అసలైన ప్రతిపక్షంగా టీఎంసీ మారిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దిగొచ్చిన యోగి సర్కార్.. లఖింపుర్‌కు విపక్ష నేతలు
ఇదీ చూడండి: 'బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతాం'