ETV Bharat / bharat

2024 ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ- మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్​గా చిదంబరం - congress party latest news

Congress Election Manifesto Committee 2024 : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. 16మందితో కూడిన ఈ కమిటీకి ఛైర్మన్‌, కన్వీనర్​లుగా ఎవరిని నియమించిందంటే?

Congress Election Manifesto Committee 2024

author img

By PTI

Published : Dec 23, 2023, 7:28 AM IST

Updated : Dec 23, 2023, 9:02 AM IST

Congress Election Manifesto Committee 2024 : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు కాంగ్రెస్‌ మేనిఫేస్టో కమిటీని ప్రకటించింది. 16మందితో కూడిన ఈ కమిటీకి ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంను నియమించింది. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌ సింగ్‌దేవ్‌ వ్యవహరిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఈ జాబితాను విడుదల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

  • Congress constitutes Manifesto Committee for the 2024 General Elections.

    P Chidambaram appointed as the Chairman and TS Singh Deo as the Convenor of the Manifesto Committee. pic.twitter.com/U6h3NJqxUf

    — ANI (@ANI) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం గురువారం దిల్లీలో జరిగింది. ఆ మర్నాడే ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేయడం విశేషం.

పార్టీ నేతలపై రాహుల్ ఆగ్రహం
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్ర విభాగాలు అనుసరించిన వ్యూహాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిలో చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటుకు తమ పార్టీ అంగీకరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు కీలక రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంపై దిల్లీ వేదికగా గురువారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చ జరిగింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం
బీజేపీని ఓడించేందుకు చిన్న పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ విభాగాలు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అంగీకరించి ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చేసిన పొత్తు ప్రతిపాదనను కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ తిరస్కరించడాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కమలదళంపై పోరులో ప్రతి ఓటూ కీలకమేనని అన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ తగిన స్థాయిలో ప్రచారం నిర్వహించలేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏడాది కిందట మూడో స్థానంలో ఉన్నప్పటికీ గొప్పగా పుంజుకొని విజయం సాధించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కొంత బలంగా ఉందని కొందరు నాయకులు పేర్కొనగా ఆ పార్టీ అజేయమైనదేమీ కాదంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

'ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేశారు- నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ'- మోదీ సర్కారుపై విపక్షాలు ఫైర్

'కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ.351 కోట్లు సీజ్- భారీగా ఆభరణాలు సైతం'- సీబీడీటీ అధికారిక ప్రకటన

Last Updated : Dec 23, 2023, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.