ETV Bharat / bharat

లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ - లఖింపుర్ ఖేరి ఘటన న్యూస్ టుడే

లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించిన నిజానిజాలు వివరించేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనుంది కాంగ్రెస్. రాష్ట్రపతికి ఓ మెమొరాండం సమర్పించనుంది.

congress
కాంగ్రెస్
author img

By

Published : Oct 12, 2021, 3:39 PM IST

లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri News) ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌కు 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించనుంది కాంగ్రెస్(Congress Party). ఈ మేరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా.. కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనుంది. ఈ బృందంలో రాహుల్​తో పాటు.. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra).. సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్ ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని.. సంబంధిత కేసు ఎఫ్ఐఆర్‌లో మంత్రి కుమారుడు ఆశిష్​ మిశ్రాను చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే.. ఇప్పటికే ఆశిష్‌ మిశ్రాను ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.