congress chintan shivir: వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న పార్టీ సమూల ప్రక్షాళనే లక్ష్యంగా చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయ్‌పుర్ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపింది. అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మొత్తం 20 ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.
CONGRESS chintan shivir CWC: ఇక పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 'ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్' విధానాన్ని ఆమోదించింది. ఒక నాయకుడు ఐదు సంవత్సరాల పాటు ఒక పోస్ట్‌లో ఉండాలని తీర్మానించింది. మరొకరు అదే కుటుంబం నుంచి వచ్చేట్లు అయితే.. కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పని చేయాలని నిబంధన విధించింది. 70 ఏళ్లు నిండిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న సూచనపై ఏకాభిప్రాయం కుదరలేదు.
మరోవైపు, పార్టీలో యువతకు 50 శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ స్థాయి వరకు 50 శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోవాలని సంకల్పించుకుంది. 50 శాతం యువత కోటాలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మైనారిటీలకు కూడా చోటు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పాటు, కేరళ తరహాలో పార్టీకి జాతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయపడేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. పార్టీలో ప్రియాంక గాంధీ పాత్రను పెంచడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
డిక్లరేషన్‌లోని మరిన్ని అంశాలివే...
- 'ఒకే కుటుంబం- ఒకే పదవి' అనే నిబంధనను అమలు చేయనుంది.
- ఐదేళ్ల పాటు పార్టీలో పనిచేసి ఉంటేనే.. కుటుంబంలోని మరో వ్యక్తి టికెట్ ఇవ్వనుంది.
- కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పార్టీ పదవుల్లో ఉండకూడదని నిబంధన.
- పార్టీలో మూడు కొత్త శాఖల ఏర్పాటుకు అంగీకారం. పబ్లిక్ ఇన్సైట్, ఎన్నికల నిర్వహణ, జాతీయ స్థాయిలో శిక్షణ అనే విభాగాల ఏర్పాటు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
ఇదీ చదవండి: