పంజాబ్ సీఎంగా ఓ దళిత నేతను కాంగ్రెస్(punjab congress news) ఎన్నుకోవడం వల్ల రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి(congress news india). కాంగ్రెస్ 'దళిత' అస్త్రం ఇతర రాష్ట్రాలపైనా, ముఖ్యంగా రానున్న నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్పై(uttar pradesh election 2022) ప్రభావం చూపించే అవకాశముంది. పంజాబ్‌లో దళిత సీఎం ఉండటం వల్ల ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధిచేకూరుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయంపై యూపీ కాంగ్రెస్ నేత వివేక్ బన్సల్(up congress news) ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. 'కాంగ్రెస్ ఓ జాతీయస్థాయి పార్టీ. అందువల్ల ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా ఉంటుంది. ఓటుబ్యాంకు పరంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో వీటి ప్రభావం చాలా ఉంటుంది. ఎస్సీ, ఓబీసీ వర్గంపైనే ఇది కీలకంగా ఉండే అవకాశముంది' అని విశ్లేషించారు.
పోటీ తప్పదు!
పంజాబ్‌తో పోల్చుకుంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ 'దళిత' అస్త్రానికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఇందుకు కారణం(up bsp news). రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పటికే దళితుల ఓటు బ్యాంకు బలంగా ఉంది. దీనితో పాటు ఇప్పుడు బ్రాహ్మణులను కూడా తమవైపు తిప్పుకోవాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రణాళికలు రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో దళితులు-బ్రాహ్మణుల సామాజిక వర్గాల అండతో విజయం సాధించాలని ఆశిస్తోంది. నిజానికి బీఎస్పీకి ఇది కొత్తేమీ కాదు. 2007లో ఇదే అస్త్రాన్ని ప్రయోగించి గెలుపొందింది.
ఇదీ చూడండి:- ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో నయా రాజకీయం!
మరోవైపు బీఎస్పీ ప్రణాళికలను విమర్శించే వారూ ఉన్నారు. బ్రాహ్మణుల మాట పక్కనపెడితే.. దళితుల్లోనే ఆ పార్టీ పట్టుకోల్పోతోందన్నది వీరి వాదన.
"ఇతర కులాలు, వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు బీఎస్పీ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ సొంత కేడర్లోనే ఆ పార్టీ ఉనికిని కోల్పోతోంది. అటు బ్రాహ్మణ సమాజంతో పాటు ఇతర వర్గాలు కూడా బీఎస్పీపై అసంతృప్తితోనే ఉన్నాయి. ఒక వర్గాన్నే పట్టించుకుని, ఇన్నేళ్లు తమను దూరంపెట్టారని మండిపడుతున్నాయి. అదే సమయంలో వారికి అధికారపక్షం(భాజపా)తో స్నేహబంధం ఉండటం బీఎస్పీకి చేటుచేస్తోంది."
-- వివేక్ బన్సల్, కాంగ్రెస్ నేత.
వాస్తవానికి ఈ విషయంలో కాంగ్రెస్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీలో బ్రాహ్మణ సమాజానికి ముఖచిత్రంగా ఇన్నేళ్లు ఉన్న జితిన్ ప్రసాద్.. అనూహ్యంగా భాజపాలో చేరారు.
అయితే జితిన్ ప్రసాద్ పార్టీ మార్పుతో కాంగ్రెస్‌కు నష్టమన్న వ్యాఖ్యలను వివేక్ బన్సల్ కొట్టిపారేశారు.
"ఏ ఒక్కరిపైనా పార్టీ ఆధారపడదు. అందరికన్నా పార్టీయే పెద్దది. పార్టీలో వ్యక్తి ప్రభావం కొంతే ఉంటుంది. తమను పట్టించుకోవడం లేదని ఆ సమాజం ప్రజలు అనుకుంటున్నారు. ఆ నేత వెళ్లిపోయినంత మాత్రాన వారి పరిస్థితి మారదు. వాస్తవానికి, ఆ నేతకు బయట పేరు ఉందే తప్ప, సొంత ప్రజలపై ఆయన ప్రభావం చాలా తక్కువ."
-- వివేక్ బన్సల్, కాంగ్రెస్ నేత
కాంగ్రెస్-ఎస్పీ పొత్తు?
పంజాబ్‌లో 'దళిత' కార్డుతో కాంగ్రెస్‌వైపు ఇతర పార్టీలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుకు ఎస్పీ(సమాజ్‌వాది పార్టీ) యోచిస్తున్నట్టు సమాచారం(up sp news). మరోవైపు దళితులను ఆకట్టుకునేందుకు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(priyanka gandhi news) చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరి కాంగ్రెస్ 'దళిత' అస్త్రం ఫలిస్తుందా? ప్రజలు కాంగ్రెస్‌కు పట్టంగడతారా? అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!
ఇదీ చూడండి:- మారుతున్న వ్యూహాలు- యూపీ, బిహార్లలో నయా కుల సమీకరణలు