ETV Bharat / bharat

కాంగ్రెస్​ ట్విట్టర్​ ఖాతా బ్లాక్​- అసలు కారణమేంటి? - rahul gandhi

దేశంలో కాంగ్రెస్​ నేతల ట్విట్టర్​ ఖాతాల నిలిపివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తమ పార్టీ అధికారిక ఖాతా సహా.. 5 వేల మంది నేతల ట్విట్టర్​ ఖాతాలు నిలిచిపోయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ట్విట్టర్​ ఈ మేరకు వ్యవహరించిందని ఆరోపించింది.

Congress
ట్విట్టర్
author img

By

Published : Aug 12, 2021, 7:04 AM IST

Updated : Aug 12, 2021, 2:43 PM IST

నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ పార్టీ నేతలకు చెందిన 5వేల ఖాతాలను ట్విట్టర్​ రద్దు చేసిందని కాంగ్రెస్ గురువారం తెలిపింది. కాంగ్రెస్​ అధికారిక ఖాతా, రణదీప్​ సూర్జేవాలా ఖాతా సహా ఐదు వేల మంది కీలక నేతల అకౌంట్లను ట్విట్టర్​ లాక్​ చేసిందని ఏఐసీసీ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా వెల్లడించారు.

"కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్విట్టర్​ పనిచేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలకు చెందిన 5వేల ఖాతాలను నిలిపివేసింది. అయితే ట్విట్టర్​, కేంద్రం ఒత్తిడికి మేము(కాంగ్రెస్) తలొగ్గమని వారు తెలుసుకోవాలి.​"

-రోహన్ గుప్తా, ఏఐసీసీ సోషల్ మీడియా హెడ్

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను లాక్‌ చేసిన కొన్ని రోజులకే ఇలా జరగడం గమనార్హం. దేశం కోసం తాము చేసే పోరాటాన్ని ఇలాంటి చర్యల ద్వారా ఆపవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిరసన తెలపడాన్ని, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేయడాన్ని తప్పుగా చూస్తున్నారని మండిపడింది. ట్విట్టర్‌ ఖాతాలను బ్లాక్‌ చేసే కాంగ్రెస్‌ నేతల జాబితా మరింత పెరగవచ్చని తెలిపింది.

అందుకే బ్లాక్..

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ఖాతాలతో పాటు కాంగ్రెస్ అధికారిక అకౌంట్​ను బ్లాక్ చేయడానికి గల కారణాన్ని ట్విట్టర్ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫొటోను పోస్ట్ చేసినందుకు ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఇలా చేసినట్లు వివరించింది. సంస్థ రూల్స్​ను పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 'మా నియమాలను ఉల్లంఘించేలా ఓ చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు వేల ట్వీట్లపై చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాగే చర్యలు చేపడతాం' అని ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు.

ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లను తొలగించకపోతే.. సంబంధిత ఖాతాను సంస్థ తాత్కాలికంగా నిలిపివేస్తుంది. వివాదాస్పద ట్వీట్​ను డిలీట్ చేసేంత వరకు లేదా.. ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు సస్పెన్షన్​ను కొనసాగిస్తుంది.

దిల్లీ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను ఇటీవల కలిసిన రాహుల్ గాంధీ.. ఓ చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. మైనర్ బాధితురాలి కుటుంబం వివరాలు తెలిసేలా ఫొటో ఉందని జాతీయ బాలల హక్కుల కమిషన్ ట్విట్టర్​కు ఫిర్యాదు చేసింది. దీనిపైనే ట్విట్టర్ చర్యలు తీసుకుంది.

ఇదీ చూడండి: 'కొత్త ఐటీ రూల్స్​ పాటిస్తున్న ట్విట్టర్'

Last Updated : Aug 12, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.