ETV Bharat / bharat

'బిహార్​ ప్రజలు సీఎం కుర్చీ బహుమతిగా ఇస్తారు' - బిహార్​ ముఖ్యమంత్రి తేజస్వీ

బిహార్​ ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు తేజస్వీకి పుట్టినరోజు కానుకగా సీఎం పీఠాన్ని ఇస్తారని లాలూ అన్నట్లు సమాచారం.

CM's chair
'బిహార్​ ప్రజలు నీకు సీఎం కుర్చీ బహుమతిగా ఇస్తారు'
author img

By

Published : Nov 9, 2020, 11:30 PM IST

Updated : Nov 10, 2020, 2:03 AM IST

పలు కుంభకోణాల కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తోన్న లాలు ప్రసాద్​ యాదవ్​.. బిహార్​ ఎన్నికల ఫలితాల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ తన కుమారుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా లాలూ ఆయనతో మాట్లాడారట. ఈ సందర్భంగా బిహార్​ ప్రజలు నీకు సీఎం పీఠాన్ని బహుమతిగా ఇస్తారని చెప్పినట్లు సమాచారం. లాలూ ప్రస్తుతం రాంచి రాజేంద్ర ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​లో చికిత్స పొందుతున్నారు.

నేడు తేజస్వీ పుట్టినరోజును ఆర్​జేడీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా చేసింది. ఈ సందర్భంగా తేజస్వీ సోదరుడు తేజ్​ ప్రతాప్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

"నితీశ్​ కుమార్​ను ఈ ఎన్నికల్లో బిహార్​ ప్రజలు తిరస్కరించారు. నిరుద్యోగం వంటి సమస్యలను తీర్చలేకపోయిన జేడీయూ చేతకానితనం వల్లే ప్రజలు మాకు మద్దతు పలికారు. ఆయన ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఎగ్జిట్​ పోల్స్​ను పక్కనపెడితే మాకు ప్రజలపై నమ్మకం ఉంది. వాళ్లు మాకు భారీ విజయాన్ని అందిస్తారు".

- తేజ్​ప్రతాప్​, లాలూ​ కుమారుడు

ఒకవేళ తేజస్వీ యాదవ్​ ముఖ్యమంత్రి అయితే లాలూ కుటుంబం నుంచి మూడవ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తారు. అంతకుముందు లాలూ ప్రసాద్​, ఆయన సతీమణి రబ్రీదేవీ బిహార్​ రాష్ట్రానికి సీఎంలుగా పనిచేశారు.

ఇదీ చూడండి:తేజస్వీ జన్మదిన వేడుకల్లో 'ఫలితాల' జోష్

Last Updated : Nov 10, 2020, 2:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.