CM Shivraj Singh Chouhan MP Assembly Election 2023 : మధ్యప్రదేశ్‌లో 'మామా' మేజిక్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆయన నేతృత్వంలోని బీజేపీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు నెలకొంటుందనుకున్నా ఆయన మాస్టర్ ప్లాన్‌ను పర్ఫెక్ట్గా అమలు చేసి భారతీయ జనతా పార్టీ- బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా 'మామా'తో ప్రజలకు అనుబంధాన్ని ఛేదించలేకపోయాయి. ఆ 'మామా' మరెవరో కాదు 2003 నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న (డిసెంబర్ 2018-మార్చి 2020 వరకు 15 నెలల మినహా) శివరాజ్ సింగ్ చౌహాన్.
-
VIDEO | MP elections 2023: "I bow down to all my supporters," says CM @ChouhanShivraj outside his residence in Bhopal as BJP continues to maintain comfortable lead in Madhya Pradesh.#AssemblyElectionsWithPTI #MadhyaPradeshElection2023 pic.twitter.com/HayirtQtXH
— Press Trust of India (@PTI_News) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | MP elections 2023: "I bow down to all my supporters," says CM @ChouhanShivraj outside his residence in Bhopal as BJP continues to maintain comfortable lead in Madhya Pradesh.#AssemblyElectionsWithPTI #MadhyaPradeshElection2023 pic.twitter.com/HayirtQtXH
— Press Trust of India (@PTI_News) December 3, 2023VIDEO | MP elections 2023: "I bow down to all my supporters," says CM @ChouhanShivraj outside his residence in Bhopal as BJP continues to maintain comfortable lead in Madhya Pradesh.#AssemblyElectionsWithPTI #MadhyaPradeshElection2023 pic.twitter.com/HayirtQtXH
— Press Trust of India (@PTI_News) December 3, 2023
-
प्रधानमंत्री श्री @narendramodi जी की गारंटी पर जनता का अटूट विश्वास है।
— BJP Madhya Pradesh (@BJP4MP) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
भाजपा की डबल इंजन सरकार को मध्य प्रदेश की जनता का भरपूर आशीर्वाद मिला है।
-मुख्यमंत्री श्री @ChouhanShivraj#भगवामय_मध्यप्रदेश#MPKeMannMeinModi pic.twitter.com/iJyZfGR4OU
">प्रधानमंत्री श्री @narendramodi जी की गारंटी पर जनता का अटूट विश्वास है।
— BJP Madhya Pradesh (@BJP4MP) December 3, 2023
भाजपा की डबल इंजन सरकार को मध्य प्रदेश की जनता का भरपूर आशीर्वाद मिला है।
-मुख्यमंत्री श्री @ChouhanShivraj#भगवामय_मध्यप्रदेश#MPKeMannMeinModi pic.twitter.com/iJyZfGR4OUप्रधानमंत्री श्री @narendramodi जी की गारंटी पर जनता का अटूट विश्वास है।
— BJP Madhya Pradesh (@BJP4MP) December 3, 2023
भाजपा की डबल इंजन सरकार को मध्य प्रदेश की जनता का भरपूर आशीर्वाद मिला है।
-मुख्यमंत्री श्री @ChouhanShivraj#भगवामय_मध्यप्रदेश#MPKeMannMeinModi pic.twitter.com/iJyZfGR4OU
'మామా' రాయకీయ భవిష్యత్‌పై నీలినీడలు..
మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్‌ను అందరూ ముద్దుగా 'మామా' పిలుస్తారు. తాజాగా ఈయన దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విశ్లేషణలను.. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలతో పటాపంచలు చేశారు. అయితే 'మామా' ఇక్కడి వరకు రావడానికి చిన్నపాటి యుద్ధమే చేశారనడంలో సందేహం లేదు.
ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. రాజకీయంగా అపార అనుభవం ఉంది. ఇలాంటి నేతను దాదాపు పక్కనే పెట్టినంత పని చేసింది బీజేపీ అధిష్ఠానం! మామా పేరును తొలి రెండు అభ్యర్థుల జాబితాల్లో ప్రకటించలేదు. దీని కారణంగా ఆయన ముఖ్యమంత్రి రేసులో లేరని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచనున్నారనే వార్తలు సైతం వచ్చాయి. దీంతో సొతం పార్టీ అపనమ్మకంతో శివరాజ్ సింగ్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ప్రజలు ఆయనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారు.
-
#WATCH | Bhopal: BJP workers pour milk on a poster portraying Madhya Pradesh CM Shivraj Singh Chouhan as Lord Hanuman as the party leads towards a landslide victory in the state pic.twitter.com/JHi638VZsq
— ANI (@ANI) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Bhopal: BJP workers pour milk on a poster portraying Madhya Pradesh CM Shivraj Singh Chouhan as Lord Hanuman as the party leads towards a landslide victory in the state pic.twitter.com/JHi638VZsq
— ANI (@ANI) December 3, 2023#WATCH | Bhopal: BJP workers pour milk on a poster portraying Madhya Pradesh CM Shivraj Singh Chouhan as Lord Hanuman as the party leads towards a landslide victory in the state pic.twitter.com/JHi638VZsq
— ANI (@ANI) December 3, 2023
మహిళా సాధికారతకు పెద్ద పీట..
అయితే పరిస్థితులు అన్నీ కట్టగట్టుకుని దాడి చేసినా 'మామా' ధైర్యం కోల్పోలేదు. తనకు ప్రజల్లో ఉన్న నమ్మకాన్నే పెట్టుబడిగా చేసుకుని ముందుకు కదిలారు. తాను చేసిన అభివృద్ధి- పేద, బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలే అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లారు. పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి రూ.450కే సిలిండర్ అందించారు. దీని ద్వారా లబ్ధి పొందిన దాదాపు 1.3 కోట్ల మంది మహిళలను తాను చేసిన సంక్షేమాన్ని గుర్తించాల్సిందిగా అభ్యర్థించారు. 15 లక్షల మంది మహిళలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ, ఆడపిల్లలకు యుక్తవయస్సు వచ్చే వరకు ఆర్థిక సాయం, లాడ్లీ బెహ్నా, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంపు వంటి హామీలతో తాము ప్రభుత్వంలోకి వస్తే ఆడపిల్లలకు, మహిళల కోసం పాటుపడతానని హామీ ఇచ్చి వారు మనసులను గెలుచుకున్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమం అందేలా..
దాదాపు 30 లక్షల జూనియర్ లెవెల్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచడం, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, 78,000 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్స్, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా క్వింటా గోధుమలను రూ.2,700, ధాన్యాన్ని రూ. 3,100 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు, వచ్చే ఐదేళ్లపాటు పేదలందరికీ ఉచిత రేషన్, కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ కల్యాణ్ యోజన కింద ప్రతి రైతుకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, ముఖ్యమంత్రి జన్ ఆవాస్ యోజన, పేద ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం వంటి హామీలతో భవిష్యత్తులో కూడా తమ వెంట ఉంటాననే నమ్మకం ప్రజలకు కలిగించారు.
దిల్లీ పెద్దలకు దీటుగా..!
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 166 ర్యాలీల్లో పాల్గొని ప్రచారం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలోని ప్రతి మూలకు వెళ్లి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఇలా పార్టీ వర్గాల నుంచి కూడా మద్దతు కూడగట్టారు. దీంతోపాటు బీజేపీ హిందుత్వ అజెండాను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మోదీ వేవ్‌ను ఉపయోగించుకుని ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేశారు.
ఐదోసారి- 'మామా' సీఎం అవుతారా?
అయితే ఇన్ని చేసినా అటు పార్టీ గానీ, ఇటు మీడియా గానీ ఆయనను గుర్తించలేదు. ఆయన ఓటమి ఖాయం అని వ్యాఖ్యానాలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లోనూ పలు సంస్థలు 'మామా' ఓటిమి తథ్యం అని తేల్చేశాయి. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ మామా నేతృత్వంలోని బీజేపీ తాజా ఫలితాల్లో దూసుకెళ్లింది. మునుపటి కంటే ఎక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది. అయితే ఇప్పటివరకు 'మామా' నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇంత చేసినా 'మామా'కు ఇప్పుడు ఐదోసారి అధికారం కట్టబెడతారా? లేదా మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరం.
ఆరోసారి కొనసాగిన 'మామా' విజయ పరంపర..
Shivraj Singh Chouhan Political Career : 2023 శాసనసభ ఎన్నికల్లో బుధ్ని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నటుడు విక్రమ్ మస్తల్పై 1,04,974 ఓట్ల మెజారిటీతో ఆరోసారి గెలిచారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 1990లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఆయన మొదటి సారి గెలుపొందారు. ఆ తర్వాత 2006 ఉప ఎన్నికల్లో గెలిచారు. అనంతరం జరిగిన 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అంతేకాకుండా 1991, 1996, 1998, 1999, 2004లో విదిశా పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఈయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్లడం గమనార్హం.
భోపాల్ పీఠం మళ్లీ బీజేపీదే! కాంగ్రెస్‌పై స్పష్టమైన ఆధిక్యంలో కమలదళం
''ఇండియా'ను ఏం చేద్దాం?'- ఎన్నికల ఫలితాలపై విపక్ష నేతల కీలక భేటీ