ETV Bharat / bharat

హరియాణా సీఎంకు నిరసనల సెగ.. రైతులపై లాఠీఛార్జి - రైతులు

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రోహ్​తక్​లో ఓ కార్యక్రమానికి ఆయన హాజరుకావాల్సి ఉండగా, ఆ ప్రాంతానికి చేరుకున్న రైతులు సాగుచట్టాలను రద్దు చేయాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు.

cm manohar lal helicopter landed in sunaria jail after farmers protest in rohtak
హరియాణా సీఎంకు నిరసనల సెగ.. రైతులపై లాఠీ
author img

By

Published : Apr 4, 2021, 5:51 AM IST

హరియాణా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్​కు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రోహ్​తక్​ ఎంపీ అర్వింద్ శర్మ తండ్రి ఇటీవల మరణించారు. దీంతో ఆయన సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం శనివారం రోహ్​తక్ జిల్లాలోని అస్థల్​ బోహర్​కు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన రైతులు స్థానిక ప్రైవేటు యూనివర్సిటీలో సీఎం హెలికాప్టర్​ దిగే ప్రాంతానికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

హరియాణా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్​కు రైతుల నుంచి వ్యతిరేకత

ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించడమే కాకుండా, బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అన్నదాతలు వాటిని దాటుకొని యూనివర్సిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. ప్రతిగా రైతులు రాళ్లురువ్వారు. పలువురు రైతులతో పాటు ఓ పోలీసు కూడా గాయపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల హెలికాప్టర్​ను మరోచోట నిలిపారు.

cm manohar lal helicopter landed in sunaria jail after farmers protest in rohtak
రైతులతో పోలీసులకు వాగ్వాదం

లాఠీఛార్జిని నిరసిస్తూ ఖండేలా గ్రామంలో జింద్-ఛండీగఢ్​ జాతీయ రహదారిని దిగ్బంధించారు రైతులు. అయితే స్థానిక పోలీసు వారిని ఒప్పించి దిగ్బంధనాన్ని ఎత్తివేయించారు. అంతకుముందు హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలకు వ్యతిరేకంగా హిసార్ విమానాశ్రయం బయట కర్షకులు గురువారం నిరసన చేశారు.

ఇదీ చూడండి: నిఖితా తోమర్​ హత్య కేసు దోషులకు జీవితఖైదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.