CM KCR Reaction on Exit polls Results : రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పరేషాన్ కావొద్దని.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుందని పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో ఇవాళ పలువురు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సీఎం వారితో మాట్లాడారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని.. రాష్ట్రాన్ని పాలించబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని చెప్పినట్లు సమాచారం. ఇవాళ, రేపు ఓపిక పడితే 3వ తేదీన సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
CM KCR on Telangana Elections Results : తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. తనను కలిసిన నేతలతో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై చర్చినంచిన గులాబీ దళపతి.. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న ఫలితాలను కొట్టి పారేసినట్లు తెలుస్తోంది. నేతలను ఆగం కావొద్దంటూ ధైర్యం నింపిన సీఎం కేసీఆర్.. 3వ తేదీన సంబురాలకు పిలుపునిచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్
KTR Reacts on Exit polls Results : ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 2018లోనూ ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్క సంస్థ మాత్రమే టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) గెలుస్తుందని సరిగా చెప్పిందని.. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఓడిపోతుందని చాలా సంస్థలు చెప్పాయని గుర్తు చేశారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ తప్పాయన్న ఆయన.. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయో.. ఈసారి కూడా అలాంటి ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
-
After a long time had a peaceful sleep 😴
— KTR (@KTRBRS) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR
">After a long time had a peaceful sleep 😴
— KTR (@KTRBRS) December 1, 2023
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCRAfter a long time had a peaceful sleep 😴
— KTR (@KTRBRS) December 1, 2023
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR
Telangana Elections Polling 2023 : ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈసారి 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నామని.. కానీ 70 వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయ ఉందని అనుకోవట్లేదని చెప్పారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే(Exit Polls Survey) జరుగుతుందని వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. అదేవిధంగా కేటీఆర్ విజయంపై ధీమాను పునరుద్ఘాటిస్తూ ఇవాళ మరో ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎక్కువ చేసి చూపించినా.. వాస్తవ ఫలితాలు తమకే శుభవార్త చెబుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ సీరియస్ - 100 శాతం అధికారంలోకి వస్తామని ధీమా
సిరా చుక్కతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే?