CM Jagan Comments on Election : గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ బిల్లు సహా వివిధ బిల్లుల కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదాన్ని తెలియజేసింది. సచివాలయం లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ పాఠశాల విద్యా శాఖ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటర్ నేషనల్ బాక్యూలరేట్ సిలబస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను ఏర్పాటు చేసే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ కు ఆమోదం తెలియ జేసింది. పాఠశాల విద్యా శాఖ లో అంతర్జాతీయ సిలబస్ అమలు చేసేందుకు వీలుగా ఇంటర్ నేషనల్ బాక్యు లారేట్ అమలుకు వీలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటో తరగతి నుంచి ప్రారంభించి మిగతా తరగతులకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఐబి సంస్థ ప్రతినిధులు తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు 2022కి ఆమోదాన్ని తెలిపింది. అటుఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల కు సంబంధించిన అంశంపై కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఏపీ గ్యారెంటీ డ్ పెన్షన్ స్కీమ్ బిల్లు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు వీలుగా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇంటి స్థలం, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఇంబర్స్ మెంట్ కల్పించేలా మార్గదర్శకాల ను రూపొందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దివ్యాంగుల ఒలింపిక్స్ లో పతకం సాధించిన క్రీడా కారిణి షేక్ జఫ్రీన్ కు గ్రూప్ 1 హోదా ఉద్యోగంతో పాటు 10 సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చేందుకు తీర్మానించింది. కింగ్ జార్జ్ ఆస్పత్రి సహా ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు 353 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. వైద్యశాఖలో జీరో వేకేన్సీ విధానం అమలు కు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు.
ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద వైద్య పరీక్షలు, ఔషధాలు ద్వారా గ్రామాల్లో మ్యాపింగ్ కు కేబినెట్ లో చర్చించారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ యూనివర్సిటీ లతో కలిసి జాయింట్ సర్టిఫికేషన్ ఇచ్చేలా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కురుపాం ఇంజినీరింగ్ కళాశాల లో గిరిజనులకు 50 శాతం రిజ్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆధార్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట అవార్డులు ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష, మెయిన్ పాస్ అయితే 50 వేల ప్రోత్సాహక అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్ని సార్లు పాస్ అయినా ప్రోత్సాహక నగదు అందిస్తామని కేబినెట్ పేర్కొంది. మరోవైపు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్, కమ్యునిస్ట్ పార్టీ మావోయిస్ట్ పై మరో ఏడాది పాటు నిషేధం విధించేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ ఎస్ జి) బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాకినాడ బల్క్ డ్రగ్ పార్కు ను నక్కపల్లి లో ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి, ఒంగోలు, ఏలూరుల్లోని నర్సింగ్ కళాశాలలు, వివిధ ప్రభుత్వ శాఖల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ చట్ట సవరణ కు, దేవాదాయ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ భూములు చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది.