కర్ణాటక బెళగావిలోని జీవన రేఖ ఆసుపత్రి చిన్నపిల్లలపై కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా కంపెనీ తయారు చేసిన 'జైకొవ్-డి' వ్యాక్సిన్‌ను పిల్లలపై ప్రయోగించింది.
"20మంది చిన్నారులపై జైకొవ్-డి వ్యాక్సిన్ ట్రయల్స్ జరిపాం. ఏ ఒక్కరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదు. 12 నెలల పాటు పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాం."
-అమిత్ భాటే, వైద్యుడు
అంతకుముందు కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌ను మూడు దశల్లో పిల్లలపై ఈ ఆసుపత్రే నిర్వహించింది. మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండో డోసును ఇచ్చారు. మూడో డోసును 56వ రోజు ఇచ్చారు. ఎవరిలోనూ దుష్ప్రభావాలు తలెత్తలేదు. అయితే వ్యాధినిరోధక సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం పిల్లల రక్తనమూనాల్ని పరీక్షిస్తారు.
ఇదీ చదవండి: అత్యంత ఎత్తైన గ్రామంలో 100% వ్యాక్సినేషన్!