కోల్‌కతా షేక్స్పియర్ వీధిలోని మల్డాలో దారుణం జరిగింది. ఆసిఫ్ మెహబూబ్ అనే 12వ తరగతి చదివే కుర్రాడు తన సొంత కుటుంబ సభ్యులనే చంపేశాడు. అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి.. ఇలా అందరిని గుట్టు చప్పుడు కాకుండా హతమార్చాడు. వారిని చంపేటప్పుడు అడ్డు వచ్చిన సొంత అన్నని పై కూడా హత్యాయత్నం చేయబోయాడు. దీంతో భయపడిన సోదరుడు నోరు మొదపకుండా ఉండిపోయాడు. ఇంట్లో ఉన్న మరో వ్యక్తి.. తాతయ్య. ఈ విషయం ఎవరికి అయినా చెప్తే అతడిని కూడా చంపేస్తాను అని బెదిరించాడు. బయట వారికి అనుమానం రాకుండా చంపిన నలుగురుని ఇంటిలోనే ఖననం చేయడం గమనార్హం. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇలా బయటపడింది...
ఆసిఫ్ సోదరుడు రాహుల్ ఇప్పటివరకు భయంతో మిన్నకుండి పోయాడు. అయితే శుక్రవారం సాహసం చేసి స్థానికంగా ఉండే కలియాచక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పాడు. కానీ పోలీసులు నమ్మలేదు. అయితే ఆసీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. తాతయ్య చేసిన ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేశారు.
ఆస్తి కోసమేనా..?
ఆసిఫ్ తండ్రి జావద్ అలీ. వృత్తిరీత్తా వ్యవసాయం చేసే వారు. దానితో పాటు రెండు డంపర్లు కూడా ఉన్నాయి. అంతేగాక ఇతర వ్యాపారాలు కూడా చేసేవారు. అతని చిన్న కొడుకు ఆసిఫ్ ఇంటర్ సెకండియర్ పరీక్షలు అయిన వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి పెద్ద మొత్తంలో డబ్బును బ్యాంక్ అకౌంట్లో వేయించుకుని ఆసిఫ్ విత్‌డ్రా చేసుకునేవాడని పోలీసుల దర్యాప్తులో తెలింది. ఇదే సమయంలో అతను మిలిటెంట్ గ్రూపుతో చేతులు కలిపి ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆసిఫ్ ఇంటికి తిరిగి వచ్చాక తండ్రిపై ఒత్తిడి తెచ్చి విలువైన గ్యాడ్జెట్లు కొనిపించే వాడు. ఇవి ఎందుకు అని ఎవరూ ప్రశ్నించే వారు కాదు. మిలిటెంట్ గ్రూపులో పనిచేస్తున్నాడని తెలిశాక అతడికి కుటుంబ సభ్యులు భయపడేవారు.
కుటుంబ సభ్యులను చంపిన తరువాత తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని సుమారు కోటి రూపాయిల వరకు విక్రయించాడు ఆసిఫ్. పూర్వీకుల ఆస్తి నుంచి కొంత మేర కూడా విక్రయించాడు. ఇందుకుగాను అమ్మమ్మ, మామయ్యల సంతకాలు ఫోర్జరీ చేశాడు. చివరగా ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి.. ఇంటిని సీజ్ చేశారు.
ఇదీ చూడండి: Kumbh Mela: ఫేక్ కరోనా టెస్టులపై 'సిట్' దర్యాప్తు