ETV Bharat / bharat

'మహిళలకు అన్ని స్థాయుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి' - సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ న్యూస్

న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేయాలన్నారు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ. అన్ని స్థాయుల్లో, అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అమలు చేయాల్సిన అవసరం ఉందని తాను గట్టిగా భావిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన జీవితాన్ని తీర్చిదిద్దిన మహిళల గురించి చెప్పుకొచ్చారు.

CJI Ramana
CJI Ramana
author img

By

Published : Mar 11, 2022, 7:19 AM IST

CJI Ramana news: "నా జీవితానికి రూపునిచ్చింది సుదృఢమైన ఆదర్శప్రాయ మహిళే. ఇద్దరు అక్కల తమ్ముడిగా నేను పెరిగాను. మా అమ్మ పెద్దగా చదువుకోకపోయినా ప్రాపంచిక జ్ఞానంతో నాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పారు. గత నాలుగు దశాబ్దాలుగా మద్దతుగా నిలిచి, వివేకవంతమైన సలహాలతో మార్గనిర్దేశం చేస్తున్నది నా సహధర్మచారిణే. ఇద్దరు కుమార్తెలకు తండ్రినైనందుకు గర్వపడుతున్నా. వారిని పెంచి పెద్ద చేయడం జీవితంలో గొప్ప అనుభవం. నా జీవితంతో ముడిపడిన ఈ మహిళలంతా నా ఆలోచనా విధానాలు, చర్యలను గాఢంగా ప్రభావితం చేశారు" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

International women's day: సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. "వ్యవస్థాగతంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నాకు అవగాహన ఉంది. వారికి అన్ని రకాల నైపుణ్యాలు, విజ్ఞానం ఉన్నప్పటికీ ప్రతిదానికీ పోరాటం చేయాల్సి రావడానికి ప్రధాన కారణం ఉన్నత స్థానాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడమే. ఇప్పుడు కావాల్సింది వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన అవకాశం కల్పించడమే. చరిత్రలో ఎన్నడూలేని విధంగా సుప్రీంకోర్టులో నలుగురు మహిళా న్యాయమూర్తులున్నారు. సమీప భవిష్యత్తులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని కూడా చూడబోతున్నాం. అయితే న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం. న్యాయవృత్తి ఇప్పటికీ అతితక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉన్న రంగంగానే ఉంది. ఈ అసమతౌల్యాన్ని సరిదిద్దడానికి నావంతు ప్రయత్నం చేస్తూనే వస్తున్నా. నేను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టులో తొమ్మిది ఖాళీలను భర్తీ చేస్తే అందులో మూడింట మహిళలకే అవకాశం కల్పించాం. హైకోర్టు న్యాయమూర్తుల పదవి కోసం 192 మంది పేర్లను సిఫార్సు చేయగా అందులో 37 మంది (19శాతం) మహిళలే ఉన్నారు. దురదృష్టవశాత్తు అందులో ఇప్పటివరకు 17 నియామకాలే జరిగాయి. మిగిలినవి ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికి హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం 11.8శాతానికి చేరింది" అని జస్టిస్​ రమణ పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ప్రధానమైంది మన సమాజంలో పితృస్వామ్యం లోతుగా పాతుకుపోవడమే. మహిళలు కోర్టు గదుల్లో తరచుగా ప్రతికూల పరిస్థితులను చవిచూడాల్సి వస్తోంది. ఫలితంగా దేశంలో పేర్లు నమోదైన 17 లక్షల మంది న్యాయవాదుల్లో మహిళల నిష్పత్తి కేవలం 15శాతానికి పరిమితమైంది. మహిళలు కూడా న్యాయవాద వృత్తిలో పైకి ఎదిగే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ప్యానల్‌ అడ్వొకేట్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తే వారు కోర్టుల ముందు హాజరు కావడానికి బాటలు వేసినట్లవుతుంది. ప్రస్తుతం న్యాయాధికారుల్లో తెలంగాణలో 52శాతం, అస్సాంలో 46శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 45శాతం, ఒడిశాలో 42శాతం, రాజస్థాన్‌లో 40శాతం మహిళలు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ల వల్లే ఇది సాధ్యమైంది. మహిళలకు కల్పించే ఈ విధానం అన్ని స్థాయుల్లో, అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలి" అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 6 వేలమంది మహిళా న్యాయాధికారులు పాలుపంచుకున్నారు. అంతకుముందు జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లతో కలిసి సుప్రీంకోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ నూతన కార్యాలయాన్ని జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించారు.

ఇదీ చూడండి: నాలుగు రాష్ట్రాల్లో కమల దుందుభి.. పంజాబ్​లో ఆప్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.