ETV Bharat / bharat

హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తులను నియమించిన సీజేఐ

author img

By

Published : Aug 25, 2022, 10:05 PM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన హయాంలో వివిధ హైకోర్టుల్లో 224 మంది జడ్జిలను నియమించినట్లు సీజేఐ ఎన్​వీ రమణ పేర్కొన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, న్యాయమూర్తుల నియామకాలపై తాను దృష్టిసారించానని తెలిపారు. దీనిపై తాను అంచనాలు అందుకునేరీతిలో పనిచేసి ఉంటానని భావిస్తున్నట్లు తెలిపారు.

CJI HC JUDGES
CJI HC JUDGES

తన హయాంలో సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తులను నియమించిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ పేర్కొన్నారు. దిల్లీ హైకోర్టుకు సంబంధించి అన్ని పేర్లను తాను ఆమోదించానని తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 26న పదవి నుంచి దిగిపోనున్న జస్టిస్ రమణ.. జడ్జిల నియమకాలపై తన పదవీకాలంలో దృష్టిపెట్టానని తెలిపారు. దీనిపై న్యాయనిపుణుల అంచనాలను అందుకొనే ఉంటానని అన్నారు.

"మీరు నాపై పెట్టుకున్న అంచనాలను అందుకున్నాననే భావిస్తున్నా. ప్రధాన న్యాయమూర్తిగా నాకు సాధ్యమైన అన్ని మార్గాల్లో విధులు నిర్వర్తించా. ప్రధానంగా రెండు సమస్యలను కీలకంగా భావించా. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పనిచేశా. సుప్రీంకోర్టు, కొలీజియంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన సోదరసోదరీమణులకు నా కృతజ్ఞతలు. మనమంతా కలిసి హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తులను నియమించాం."
-సీజేఐ ఎన్​వీ రమణ

'దిల్లీ హైకోర్టు ప్రత్యేకం'
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల నియామక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కౌల్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమాకోహ్లీలు హాజరయ్యారు. వీరంతా హైకోర్టు మాజీ న్యాయమూర్తులే కావడం విశేషం. మరోవైపు, ప్రస్తుత సీజేఐ రమణ.. 2013 సెప్టెంబర్ నుంచి 2014 ఫిబ్రవరి వరకు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన అనుభవాలను జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు.

"దిల్లీ హైకోర్టుకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. దీన్ని మిగతా హైకోర్టులతో పోల్చలేం. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేను గడించిన అనుభవం సుప్రీంకోర్టు సీజేఐ పదవిని విజయవంతంగా చేపట్టడానికి ప్రారంభం వంటిది. దిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన మేం ఆరుగురం సుప్రీంకోర్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇప్పుడు నేను రిటైర్ కాబోతున్నా. అయినప్పటికీ మరో ఐదుగురు ఉంటారు. త్వరలోనే మరింత మంది ప్రాతినిధ్యం దక్కించుకుంటారని భావిస్తున్నా. దిల్లీ హైకోర్టు జడ్జిలు రాత్రి 7-8 గంటల వరకు తమ ఛాంబర్లలోనే పనిచేసేవారు. ఉదయమే కోర్టుకు వచ్చినా... కొన్నిసార్లు రాత్రి 9 వరకు ఇక్కడే ఉండేవారు. సాధారణంగా ఎక్కడైనా సాయంత్రం 4 గంటలకే న్యాయమూర్తులు వెళ్లిపోతారు. కానీ ఇక్కడ వీరి పనితీరు చూసి ఆశ్చర్యపోయా. నేను దిల్లీకి వెళ్తున్నానని తెలియగానే ధర్నాలు, స్ట్రైక్​లకు సిద్ధంగా ఉండాలని నన్ను హెచ్చరించారు. ఇక్కడివారు సంస్కారవంతులు, తెలివైనవారు, దూకుడుగా ఉంటారని నాతో చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానీ నా పదవీకాలంలో ధర్నాలు వంటివేవీ జరగలేదు. ఇక్కడి న్యాయవాదులు చక్కని క్రమశిక్షణతో ఉంటారు."
-సీజేఐ ఎన్​వీ రమణ

''ఆ' సమయంలో అండగా నిలాచారు'
రెండేళ్ల క్రితం తనకు ఎదురైన 'క్లిష్టపరిస్థితుల్లో' ప్రతి బార్ సభ్యుడు, ముఖ్యంగా దిల్లీ అసోసియేషన్ సభ్యులు తనకు అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు సీజేఐ. తనకు సంఘీభావం ప్రకటిస్తూ తీర్మానాలు ఆమోదించారని తెలిపారు. వీరే తనకు అసలైన శ్రేయోభిలాషులని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.