CJI DY Chandrachud On Constitutional Morality : తీర్పులు ఇచ్చేముందు సమాజం ఎలా స్పందిస్తుందనే విషయాన్ని కోర్టులు ఆలోచించవని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. న్యాయమూర్తులు భారత రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉంటారని.. ప్రభుత్వాలకు కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఉన్న తేడా ఇదేనని సీజేఐ వెల్లడించారు.
హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాయకత్వ శిఖరాగ్ర సమావేశంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. తీర్పుల్లో లోపాలను సరిచేయడానికి చట్టసభలు కొత్త చట్టాలను రూపొందివచ్చని తెలిపారు. కానీ, నేరుగా తీర్పులను తోసిపుచ్చే అధికారం.. ప్రభుత్వాలకు లేదని జస్టిస్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులపై ప్రభుత్వాలు ఎంతవరకు స్పందిచవచ్చన్నది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని సీజేఐ గుర్తుజేశారు.
నెలన్నర రోజులు మిగిలి ఉండగానే ఈ ఏడాది తాము దాదాపు 72,000 కేసులను పరిష్కరించామని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 'న్యాయ వ్యవస్థ ఎంట్రీ లెవెల్లో నిర్మాణాత్మక అడ్డంకులు ఉన్నాయి. ఆ ఎంట్రీ లెవెల్లో సమానంగా అవకాశాలు కల్పిస్తే న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు ప్రవేశిస్తారు. మెరిట్‌ను సమగ్ర కోణంలో నిర్వచించాల్సిన అవసరం ఉంది.' అని చంద్రచూడ్ వివరించారు. ఈ సందర్భంగా 2023 వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్లేయర్లు తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పారు.
సీనియర్ లాయర్‌పై చీఫ్ జస్టిస్ ఫైర్!
'స్వరం పెంచొద్దు. నన్ను బెదిరించొద్దు. ఈ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోండి' అంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సీనియర్ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయించడానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్‌తో తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అనూహ్య పరిణామంపై ఇతర సీనియర్ న్యాయవాదులు విచారం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ తరఫున ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు. ఈ కథనం పూర్తిగా చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
'విశ్రాంత జడ్జిల వ్యాఖ్యలు అభిప్రాయాలే.. చట్టబద్ధం కాదు'.. జస్టిస్ గొగొయికి సీజేఐ కౌంటర్!