ETV Bharat / bharat

సివిల్స్ ఫలితాలు విడుదల- టాపర్​గా శుభమ్​ - ఇండియన్ పోలీస్ సర్వీస్

ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్-2020 పరీక్షా ఫలితాలు(UPSC result 2020) విడుదలయ్యాయి. కరోనా వల్ల వరుస వాయిదాల అనంతరం పరీక్ష నిర్వహించింది యూపీఎస్సీ. 2020 సంవత్సరానికి గాను శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్​గా(upsc Topper 2020) నిలిచాడు.

UPSC
UPSC
author img

By

Published : Sep 24, 2021, 6:56 PM IST

Updated : Sep 24, 2021, 11:08 PM IST

2020 సివిల్స్​ పరీక్ష ఫలితాలను(UPSC Result) యూపీఎస్సీ విడుదల చేసింది. ఆల్ ఇండియా స్థాయిలో శుభమ్ కుమార్ మొదటి(IAS Topper 2020) ర్యాంకును సాధించగా.. జాగృతి అవస్థి, అంకితా జైన్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో(UPSC Topper List 2020) నిలిచారు. శుభమ్ ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్​ పూర్తి చేసి సివిల్స్​లో ఉత్తీర్ణత సాధించడం విశేషం. రెండో ర్యాంకు సాధించిన జాగ్రతి అవస్థి భోపాల్​లోని మణిత్ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో పట్టా పొందింది.

కరోనా పరిస్థితుల నడుమ గతేడాది పరీక్షలు నిర్వహించింది యూపీఎస్సీ. మొత్తం 761 అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. వీరిలో 545 మంది పురుష అభ్యర్థులు కాగా.. 216 మంది మహిళా అభ్యర్థులు.

అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్​ఎస్(IFS)​ అధికారులను ఎంపిక చేసేందుకు సివిల్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు..

తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ తమ సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్‌ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్‌ సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు, డి. విజయ్‌ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి 747వ ర్యాంకు సాధించారు.

civils
సివిల్స్​లో తెలుగు తేజాలు

అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఎంపిక..

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు సివిల్స్‌లో సత్తా చాటారు. రాళ్లపల్లి జగత్‌సాయి 32వ ర్యాంకు, వసంత్‌ కుమార్‌ 170వ ర్యాంకు సాధించారు. వీరి తండ్రి భీమేశ్వరరావు విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. గుండుగొలను గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఒకేసారి సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల గ్రామస్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

civils
ఒకేసారి ఎంపికైన అన్నదమ్ములు
ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్‌ ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్‌ నిట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశారు.

ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2015లో యూపీఎస్సీ సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన టీనా దాబి సోదరి రియా దాబి 15వ ర్యాంకు సాధించారు.

civils
టీనాతో ఆమె సోదరి రియా

ఇష్టపడితే కష్టం కాదు..

civils
20వ ర్యాంకు సాధించిన శ్రీజ

"మంచి ర్యాంకు సాధించాలని ప్రయత్నించాను. మొదటి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా స్థాయిలో 20వ ర్యాంకు వస్తుందనుకోలేదు. నేను ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ పూర్తి చేసి, 2019లో ఇంటర్న్‌ పూర్తి చేశాను. మెడికల్‌ సైన్స్‌ ఐచ్ఛికంగా సివిల్స్‌ రాశాను. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించాను. అఖిల భారత సర్వీసుల్లో చేరితే సమాజానికి ఎంతో చేయొచ్చని మా నాన్న చెప్పేవారు. మా అమ్మ నర్స్‌ కావడంతో హెల్త్‌ సెక్టార్‌లో ఎన్ని మార్పులు తీసుకురావచ్చో ఎప్పుడూ చెబుతుండేది. ఒక వైద్యురాలు సర్వీసెస్‌లో ఉంటే ఎలాంటి మార్పులు తీసుకురావచ్చే విషయాలు మా అమ్మ నుంచి తెలుసుకున్నాను. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఆరోగ్యం అనే కాకుండా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే సివిల్‌ సర్వీసెల్‌ ఒక ఉత్తమ మార్గం. మన అనుభవాలతో సమాజానికి ఎంతో మేలు చేసే అవకాశం లభించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా జీవితంలో ఎదిగేందుకు సివిల్‌ సర్వీసెస్‌ అవకాశం కల్పిస్తుంది. నా తల్లిదండ్రులు, నా ట్యూటర్స్ కృషి వల్లే ఉత్తమ ర్యాంకు సాధించగలిగాను. సన్నద్ధత విషయంలో ఎప్పుడూ టైం లిమిట్‌ పెట్టుకోలేదు. నేను ఎంతో సరదాగా, ఇష్టంగా చదివాను."

- శ్రీజ (ఎంబీబీఎస్, సివిల్స్‌ 20వ ర్యాంకర్‌)

ఇవీ చదవండి:

Last Updated : Sep 24, 2021, 11:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.