CISF Head Constable Jobs 2023 : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 215 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అథ్లెటిక్స్, గేమ్స్, స్పోర్ట్స్‌లో మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇది ఒక సదావకాశం. ఆసక్తి గల అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ https://cisfrectt.cisf.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు
CISF Head Constable Job Qualifications :
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి 10+2 (ఇంటర్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్/ నేషనల్/ ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో.. క్రీడాకారుడిగా పాల్గొని ఉండాలి. వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రాధాన్యత కూడా ఉంటుంది.
క్రీడాంశాలు
CISF Sports Quota Jobs :
- అథ్లెటిక్స్ : రన్నింగ్, మారథాన్, షాట్ పుట్, డిస్క్ త్రో, హేమర్ త్రో, జావెలిన్ త్రో, లాంగ్ జెంప్, ట్రిపుల్ జంప్, డెకాథ్లాన్
- గేమ్స్ అండ్ స్పోర్ట్స్ : బాక్సింగ్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, థైక్వాండో, బాడీ బిల్డింగ్
వయోపరిమితి
CISF Head Constable Age Limit : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
CISF Head Constable Fee :
- యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన పనిలేదు.
ఎంపిక ప్రక్రియ
CISF Head Constable Selection Process : అభ్యర్థులకు ట్రయల్ టెస్ట్, ప్రొఫీషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
CISF Head Constable Salary : హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం
CISF Head Constable Application Process :
- అభ్యర్థులు ముందుగా సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ https://cisfrectt.cisf.gov.in/ ఓపెన్ చేసి, లాగిన్ కావాలి.
- CISF Head Constable Recruitment 2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు, క్రీడానైపుణ్యాలకు సంబంధించిన అంశాలను నమోదు చేయాలి.
- ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి సరిచూసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
CISF Head Constable Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్ 30
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 నవంబర్ 28
SSB Constable Jobs 2023 : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరి తేదీ ఎప్పుడంటే?