లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్ష పదని నుంచి చిరాగ్ పాసవాన్‌ను తొలగించారు. ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన్ను తప్పించిన అసమ్మతి నేతలు... తాజాగా ఈ మేరకు తీర్మానం చేశారు.
సూరజ్‌భాన్ సింగ్‌ను ఎల్జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు ఎవరో తేల్చే ఎన్నికలు నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు.
ఈ తాజా పరిణామాలతో చిరాగ్ మద్దతుదారులు.. బిహార్‌లోని పార్టీ కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టారు. పశుపతి కుమార్ సహా ఐదుగురు అసమ్మతి నేతల పోస్టర్లపై నల్లరంగుతో ఇంటూ మార్కులు వేశారు.
మరోవైపు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి తొలగించినట్లు చిరాగ్ వర్గం ప్రకటించింది. జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
'పార్టీ తల్లి లాంటిది- ద్రోహం చేయకూడదు'
పార్టీలోని తాజా పరిణామాలపై చిరాగ్ తొలిసారి స్పందించారు. పార్టీని తల్లితో పోల్చిన ఆయన.. ద్రోహం చేయకూడదని వ్యాఖ్యానించారు.
"నా తండ్రి రామ్‌విలాస్ పాసవాన్ స్థాపించిన పార్టీని ఏకతాటిపై నడిపించడానికి ప్రయత్నం చేశాను. కానీ విఫలమైంది" అని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు చిరాగ్.
ఇదీ చూడండి: రూ.16కోట్ల ఇంజెక్షన్ అందక చిన్నారి మృతి