ఉత్తర్ ప్రదేశ్ హర్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దాపల్పూర్లో మూడేళ్ల బాలుడు శ్యామ్జీత్ .. ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు.
వెంటనే తల్లి కేకలు వేయటంతో.. గ్రామస్థులు అక్కడకు వచ్చారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. బాలుడు 25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాలుడ్ని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి : కరోనా రోగి మృతి- ఆస్పత్రిపై కుటుంబ సభ్యుల దాడి