ETV Bharat / bharat

బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. సేఫ్​గా బయటకు - బోరుబావిలో పడ్డ బాలుడు

నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. కొన్ని గంటలపాటు శ్రమించిన సహాయక సిబ్బంది.. అతడ్ని సురక్షితంగా బయటకు తీశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని హాపుడ్​లో జరిగిందీ ఘటన.

Child fell into borewell
Child fell into borewell
author img

By

Published : Jan 10, 2023, 3:18 PM IST

Updated : Jan 10, 2023, 7:11 PM IST

బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. సేఫ్​గా బయటకు

బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు కొన్ని గంటల తర్వాత ప్రాణాలతో బయట పడ్డాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 40 అడుగులు లోతు బావిలో పడ్డ మవును సురక్షితంగా బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని హాపుడ్​లో మంగళవారం జరిగింది.

ఇదీ జరిగింది
మొహల్లా పూల్​గఢీలోని కోట్లాకు చెందిన మోశిన్​ అనే వ్యక్తి కుమారుడు మవు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నించారు. బాలుడికి ఊపిరి ఆడేందుకు వీలుగా బోరుబావిలోకి ఆక్సిజన్​ను పంపించారు. కొన్ని గంటలు శ్రమించి.. అతడ్ని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ బోరుబావిని 35 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ అధికారులు తవ్వారు. గత 10 ఏళ్లుగా ఈ బోరుబావి నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి.. తల్లి, కుమారుడు మృతి

పప్పు గిన్నెలో పాము.. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Jan 10, 2023, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.