ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు ఓ 12 ఏళ్ల బాలుడు. ఈ సంఘటన జాంజ్గీర్ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిహరీద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వేతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. బాలుడు రాహుల్ సాహూగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. 'పిహరీద్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటనాస్థలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ సురక్షితంగా బయటపడాలని ప్రతిఒక్కరు ప్రార్థించాలి.' అని పేర్కొన్నారు.
-
जांजगीर-चांपा जिले के पिहारिद गांव में बोरवेल में गिरे 10 वर्षीय बालक राहुल को सुरक्षित निकालने हेतु अधिकारियों को निर्देश दिए हैं।कलेक्टर और एसपी मौके पर मौजूद हैं।आइए हम सब मिलकर ईश्वर से राहुल की कुशलता और बचाव अभियान की सफलता की प्रार्थना करते हैं।
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) June 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
- मुख्यमंत्री@bhupeshbaghel pic.twitter.com/7gZn0ZUIEV
">जांजगीर-चांपा जिले के पिहारिद गांव में बोरवेल में गिरे 10 वर्षीय बालक राहुल को सुरक्षित निकालने हेतु अधिकारियों को निर्देश दिए हैं।कलेक्टर और एसपी मौके पर मौजूद हैं।आइए हम सब मिलकर ईश्वर से राहुल की कुशलता और बचाव अभियान की सफलता की प्रार्थना करते हैं।
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) June 10, 2022
- मुख्यमंत्री@bhupeshbaghel pic.twitter.com/7gZn0ZUIEVजांजगीर-चांपा जिले के पिहारिद गांव में बोरवेल में गिरे 10 वर्षीय बालक राहुल को सुरक्षित निकालने हेतु अधिकारियों को निर्देश दिए हैं।कलेक्टर और एसपी मौके पर मौजूद हैं।आइए हम सब मिलकर ईश्वर से राहुल की कुशलता और बचाव अभियान की सफलता की प्रार्थना करते हैं।
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) June 10, 2022
- मुख्यमंत्री@bhupeshbaghel pic.twitter.com/7gZn0ZUIEV
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరు బావి సుమారు 80 అడుగుల లోతు ఉండగా.. బాలుడు 50 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జేసీబీ సాయంతో బోర్ బావి పక్కన గుంత తీసి బాలుడిని రక్షించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఆరోగ్య విభాగం, పరిపాలన విభాగం అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.
ఇదీ చూడండి: పక్షిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరు మృతి.. లైవ్ వీడియో!
ఆసుపత్రి నిర్లక్ష్యం.. ఒకరి శిశువు మరొకరికి.. మూడేళ్ల తర్వాత ఏమైందంటే?