మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా కేంద్రంలో అరుదైన ఘటన జరిగింది. ఓ శిశువు 32 పళ్లతో జన్మించి అందరిని ఆశ్చర్యపరిచింది. రూపాబాయ్ అనే మహిళకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 8.20 గంటలకు ప్రసవం అయింది. పుట్టిన బిడ్డకు 32 పళ్లు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అంతా బాగానే ఉండడం వల్ల మద్యాహ్నం 2.30 గంటలకి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జీ చేశారు. కానీ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఆ చిన్నారి మృతి చెందింది.
జన్యుపరమైన మార్పుల కారణంగా చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్. దీపక్ శాస్త్రి తెలిపారు. ఇలాంటి వారికి సర్జరీ చేసి నిరంతరం పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: కేరళలో భారీగా తగ్గిన కరోనా కేసులు