దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన నివాసంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. మరో మంత్రి ప్రకాశ్ జావడేకర్ సైతం తన ఇంటి ఆవరణలో జెండా వందనం చేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
రాజస్థాన్ జైపుర్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ చెన్నైలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్... పట్నాలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
దిల్లీలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.