Chhattisgarh naxals news: తన భర్తను అపహరించిన నక్సలైట్లను వెతుక్కుంటూ ఓ మహిళ అడవిలోకి వెళ్లింది. కిడ్నాప్ చేసిన తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటూ తన రెండున్నరేళ్ల కూతురితో అడవి బాట పట్టింది. అయితే, మహిళ భర్తను నక్సల్స్ విడిచిపెట్టినా.. ఆమె ఇంకా అడవిలోనే చిక్కుకుపోవడం ఆందోళనకరంగా మారింది.
Kidnapped Engineer wife entered forest
ఇటీవల ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను నక్సల్స్ అపహరించుకుపోయారు. నాలుగు రోజుల తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు. అయితే, వీరి విడుదలకు ముందే అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్.. తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. ఆయన్ను విడుదల చేయాలని నక్సల్స్‌కు భావోద్వేగంతో విజ్ఞప్తి చేసిన సోనాలీ.. వారి నుంచి స్పందన లేకపోయేసరికి అడవిలోకి వెళ్లి నేరుగా కలవాలని భావించింది.
Engineer Ashok Pawar wife Naxals
'రెండున్నరేళ్ల కూతురి ముఖాన్ని చూసైనా తన భర్తను విడుదల చేయాలని నక్సల్స్‌ను వేడుకుంటూ సోనాలీ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత భర్తను వెతుక్కుంటూ అబుజ్మద్ అడవిలోకి వెళ్లారు. స్థానిక జర్నలిస్టుల సాయంతో నక్సల్స్‌ను కలవాలని భావించారు. రెండున్నరేళ్ల కూతురిని వెంట తీసుకెళ్లారు. ఐదేళ్ల మరో కూతురు కుటుంబ సభ్యులతో ఉంది' అని ఓ జర్నలిస్ట్ వివరించారు.
అయితే, కిడ్నాప్‌కు గురైన ఇద్దరూ.. సురక్షితంగా విడుదలయ్యారు. అశోక్ పవార్, ఆనంద్ యాదవ్ తిరిగి వచ్చిన తర్వాత.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అశోక్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, పరిశీలనలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
నక్సల్స్ తమను ఇబ్బంది పెట్టలేదని ఆనంద్ యాదవ్ చెప్పారు. ఇరువురికి రూ.2 వేలు చొప్పున ఇచ్చి పంపించారని తెలిపారు.
గతంలోనూ ఓ అభినవ సావిత్రి...
ఇటీవల ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాను నక్సల్స్ అపహరించారు. అయితే, రోషన్‌ను విడిపించుకునేందుకు ఆయన భార్య అర్పిత అడవుల్లోకి వెళ్లింది. రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని వెళ్లిన ఆమె.. తన భర్తను విడిచిపెట్టాలని మావోయిస్టులను వేడుకుంది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన నక్సల్స్ ఇంజినీర్‌ను విడుదల చేశారు. ఈ పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: ఒకేసారి 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ భద్రత'!