ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం నాలుగు ట్రక్కులు అగ్నికి ఆహుతయ్యాయి. రాయ్‌పుర్ నుంచి వస్తున్న ఓ ట్రక్కు భోజ్‌పురి టోల్‌నాకా సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దీనితో పక్కనే ఉన్న మరో రెండు ట్రక్కులకు మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకున్న ట్రక్కు డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందరూ చూస్తుండగానే సజీవ దహనమైన డ్రైవర్ పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. పూర్తిగా కాలిపోయిన అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదే కారణం..
వైద్య పరికరాలతో వెళుతున్న ట్రక్కు ఢీకొట్టినందువల్లే ప్రమాదం జరిగిందని.. దీనితో మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదం శనివారం అర్ధరాత్రి జరిగిందని.. పగలు జరిగి ఉంటే ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రక్ డ్రైవర్‌ను కాపాడలేకపోయినట్లు ఓ అధికారి వెల్లడించారు.
నలుగురు చిన్నారులు..
ఉత్తర్‌ప్రదేశ్ మౌలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఆదివారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోరుబావిలో పడిందని పోలీసులు తెలిపారు. దోహ్రిఘాట్ పరిధిలోని సోన్‌బర్సా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను మమత (35), తానీ (13), మయాంక్ (6), మహి (4) దివ్యాన్ష్ (8)గా గుర్తించారు.
మరో ఘటనలో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించారు, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. షామ్లీ జిల్లాలోని పానీపత్-ఖటిమా హైవేపై కరోండ హతి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: